Sunday, January 19, 2025

కాంగ్రెస్‌ను కడిగేసిన అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి నుంచి కాంగ్రెస్‌లో చేరిన జగదీశ్ షెట్టర్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం చేయడాన్ని మజ్లీస్ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఆయన శనివారం హుబ్బలిలో జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓ ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తికి సోనియా గాంధీ ప్రచారం చేయడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. బిజెపి పార్టీ టికెట్ ఇవ్వనందుకే జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మే 10న కర్నాటక ఎన్నికలు జరుగనున్నాయి. షెట్టర్ హుబ్బలి-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.

‘ఇదా మీ సెక్యూలరిజం? ఇలాగేనా మీరు మోడీతో తలపడేది? మేడమ్ సోనియా గాంధీ మీరు ఓ ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి కోసం ప్రచారానికి వస్తారని నేను అనుకోలేదు. జగదీశ్ షెట్టర్ అయితే ఆర్‌ఎస్‌ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. చింతించాల్సిన విషయం ఏమిటంటే భావజాల పోరాటంలో కాంగ్రెస్ విఫలమైంది’ అని ఆయన కడిగిపారేశారు. ‘బిజెపిని వదిలిపెట్టేసిన వారిని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. వారిని ఆహ్వానిస్తోంది. ‘మీరు లౌకికవాది’ అంటూ వారికో సర్టిఫికేట్ ఇచ్చేసి అక్కున చేర్చుకుంటోంది’ అని కూడా ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News