Sunday, December 22, 2024

ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై దాడి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు రువ్వి ఆయన ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టారు. తర్వాత ఆయన పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదులో ఆయన గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆయన నివాసంపై సాయంత్రం 5.30 గంటలకు ఈ దాడి జరిగిందని సమాచారం. సమాచారం అందగానే అదనపు డిసిపి ఆధ్వర్యంలో పోలీసు టీమ్ ఆయన ఇంటిని సందర్శించి సంఘటన ప్రదేశం నుంచి సాక్షాలు సేకరించింది.

పార్లమెంటు వీధి పోలీస్ స్టేషన్‌లో ఓవైసీ తన ఫిర్యాదును దాఖలు చేశారు. అందులో ఆయన తన ఇంటిపై ఓ ఆకతాయి గుంపు తన ఇంటిపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలు పగులగొట్టినట్లు పేర్కొన్నారు. ‘ నేను రాత్రి 11.30 గంటలకు నా ఇంటికి చేరుకున్నాను. నేను ఇంటికి వెళ్లాక కిటికీ అద్దాలు పగిలి ఉండడం, రాళ్లు పడి ఉండడం గమనించాను. నా ఇంటి పనివారు సాయంత్రం 5.30 గంటలకు ఓ ఆకతాయి గుంపు ఇంటిపై రాళ్లు రువ్వారని తెలిపారు’ అని ఓవైసీ తెలిపారు. తన ఇంటిపై దాడి జరుగడం ఇది నాలుగోసారి అని కూడా ఆయన తెలిపారు.

‘ఇది నాలుగోసారి జరిగిన దాడి. చుట్టుప్రక్కల కావలసినన్ని సిసిటివి కెమెరాలు ఉన్నాయి. వాటి నుంచి ఆకతాయిలను గుర్తించి వెంటనే అరెస్టు చేయొచ్చు. గట్టి బందోబస్తు ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి విధ్వంసకర దాడులు జరుగుతుండడం గమనించవచ్చు’ అని ఆయన వివరించారు. ‘వెంటనే చర్యలు తీసుకుని దోషులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలి’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News