Sunday, December 22, 2024

ఆ భవనం ఖరీదు రూ. 4078 కోట్లు!

- Advertisement -
- Advertisement -

అబూధాబి రాజకుటుంబం ఆస్తుల విలువ తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే! ఆసియాలోనే అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీల ఆస్తులు కలిపితే ఎంతో అంతకంటే ఎక్కువే మరి. అబూధాబిని పాలిస్తున్న అల్ నహ్యాన్ రాజ కుటుంబం ఆస్తుల విలువ 30,500 కోట్ల డాలర్లు (25 లక్షల కోట్ల రూపాయలు). తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఇదే. ఇప్పటివరకూ ఈ స్థానంలో ఉన్న వాల్ మార్ట్ వారసులు (ఆస్తుల విలువ 19 లక్షల కోట్ల రూపాయలు) రెండోస్థానానికి పడిపోయారు.

Owners of Rs 4078 crore presidential palace

అల్ నహ్యాన్ కుటుంబం నివసిస్తున్న రాజ భవనం విలువ 4.078 కోట్ల రూపాయలు. ఇది పెంటగాన్ కంటే మూడు రెట్లు పెద్దది. 18 మంది సోదరులు, 11మంది అక్కచెల్లెళ్లు, తొమ్మిది మంది మనుమలు, 18మంది మునిమనుమలతో కళకళలాడే ఈ రాజకుటుంబానికి యుఏఇ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పెద్ద. ప్రపంచంలో ఉన్న ఆయిల్ నిల్వలలో ఆరు శాతం ఈ కుటుంబానివే కావడం విశేషం. అన్నట్టు… ప్రముఖ మాంచెస్టర్ ఫుట్ బాల్ క్లబ్ కు కూడా ఈ కుటుంబమే యజమాని. ఇలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలోనూ అల్ నహ్యాన్ రాజ కుటుంబానికి వాటా ఉంది. ఈ కుటుంబం అధీనంలో ఎనిమిది జెట్ విమానాలు కూడా ఉన్నాయి.

Owners of Rs 4078 crore presidential palace

ఇక జాయెద్ అల్ నహ్యాన్ చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హందన్ అల్ నహ్యాన్ కు కార్లు కొనడం సరదా. ఆయన వద్ద 700 కార్లు ఉన్నాయట. వీటిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎస్ యువి లాంబర్గొని రెవెంటన్ తోపాటు మెర్సిడెస్ బెంజ్ సిఎల్ కే జిటిఆర్, ఫెర్రారీ 599 ఎక్స్ ఎక్స్, మెక్ లారెన్ ఎంసి12 వంటి ఖరీదైన కార్లు బోలెడు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News