Sunday, December 22, 2024

దర్బార్ బార్‌లో కస్టమర్లపై యాజమాన్యం, సిబ్బంది దాడి

- Advertisement -
- Advertisement -

ఎనిమిది మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
కఠినంగా శిక్షించాలని బార్ ఎదుట బాధితుల కుటుంబ సభ్యుల ధర్నా

Ownership and staff attack on customers in Durbar Bar

మన తెలంగాణ/బోడుప్పల్: బార్‌కు వచ్చిన కస్టమర్లపై బార్ యాజమాన్యం, సిబ్బంది దాడి చేసిన ఘనట మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్‌కు ఆదివారం రాత్రి బోడుప్పల్‌కు చెందిన సాయికృష్ణ, టీ.సాయితో పాటు పలువురు మద్యం సేవించడానికి బార్‌కు చేరుకున్నారు. అనంతరం బిల్లు చెల్లించే విషయంలో యంఆర్‌పి (మ్యాగ్జిమం రిటేల్ ఫ్రైజ్)రేటుకే బిల్లు ఇవ్వాల్సిందిగా కస్టమర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బార్ యజమాని నవీన్ ససేమిరా అనడంతో మాట మాట పేరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఎంఆర్ రేట్లు మాత్రమే చెల్లిస్తామని చెప్పిన కస్టమర్లపై బార్ యాజమాన్యం, వేయిటర్స్ ఇనుపరాడ్లతో ఇష్టానుసారంగా మూకుమ్మడి దాడికి పాల్పడడంతో పదిమందిలో నలుగురికి గా యాలు కాగా ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గా యాల పాలైన బాధితులను స్థానిక దవాఖానాకు తరలించిన తరువాత కూడా వెంబడించి దాడి చేయడంతో డి.సాయికృష్ణ విషమంగా మారిందని బాధితులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స కోసం బాధితున్ని ఉప్పల్‌లోని ప్రవేటు దవాఖానాకు తరలించారు. దాడికి పాల్పడిన ఫిర్జాదిగూడ చెన్నరెడ్డి ఎన్‌క్లేవ్‌కు చెందిన అంబోజు నవీన్ (32), హస్తినపురానికి చెందిన కటిక కుమార్ (39), నాగోల్‌కు చెందిన మేతాటి జగన్ (36), ఫీర్జాదిగూడకు చెందిన వీరేష్ (28), బోడుప్పల్ సరస్వతి నగర్ కాలనీకి చెందిన సు దాగాని నర్సింహ (38), యాదాద్రి జిల్లాకు భువనగిరికి చెందిన బర్ల రాజిరెడ్డి (55) బార్‌లో పనిచేస్తున్న చొ క్కాల రాజవర్ధన్ (28)లను అదుపులోకి తీసుకున్నారు.

బార్‌ను సీజ్ చేయాలని కుటుంబ సభ్యుల ధర్నా

దర్బార్ బార్‌లో దాడికి గురైన బాధిత కు టుంబ సభ్యులు, స్థానికులు సోమవారం ఉదయం ఎనమిది గంటల నుండి పదకొండు గంటల వరకు వరంగల్ -హైదరాబాద్ జాతీయ రహదారికి అనుకుని ఉన్న బార్ ఎదుట ధర్నా నిర్వహించారు..దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరిగింది. దాడికి పాల్పడిన బార్ యాజమాన్యంపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని బార్‌ను సీజ్ చేయాలని కొరుతూ ముడు గంటల పాటు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాల్కజ్‌గిరి ఏసీపీ శ్యామ్ సుందర్‌రావు, మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఏసీపీ శ్యామ్ సుందర్‌రావు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినుట్ల అయన తెలిపారు. మేడిపల్లి సీఐ అంజిరెడ్డి, డిఐ మక్బూల్ జానీ, ఎస్సైలు రాఘురామ్, చంద్రశేఖర్, ఉప్పల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News