Saturday, January 25, 2025

యథేచ్ఛగా హైవే స్థలం కబ్జా

- Advertisement -
- Advertisement -

Ownership of SR Varsity occupies the highway road

ఎస్‌ఆర్ యాజమాన్యంపై చర్య తీసుకోండి

సామాన్యులకు ఒక న్యాయం..
బడా బాబులకు మరో న్యాయమా..!
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

మన తెలంగాణ/హసన్‌పర్తి: హైవే రోడ్డు స్థలాన్ని దర్జాగా కబ్జా చేసిన ఎస్‌ఆర్ యూనివర్శిటీ యాజమాన్యంపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరు చూస్తుంటే.. సామాన్యులకు ఒక న్యాయం.. బడా బాబులకు మరో న్యాయం మాదిరిగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, హసన్‌పర్తి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గిన్నారపు రోహిత్, వర్ధన్నపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు చాతళ్ల వేణుగోపాల్, అనంతసాగర్ గ్రామానికి చెందిన హసన్‌పర్తి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, హసన్‌పర్తి మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టె శ్రీనివాస్‌రెడ్డిలు డిమాండు చేశారు.

కరీంనగర్‌వరంగల్ హైవేలో వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో హైదరాబాద్-ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలకు అనంతసాగర్ మీదుగా ధర్మసాగర్ వైపుగా వెళ్లేందుకు నేషనల్ హైవేను ఏర్పాటుచేశారు. ఇందుకుగాను కరీంనగర్ నుంచి హైవే నుంచి అనంతసాగర్ క్రాస్ రోడ్డు నుంచి మడిపల్లి, ఉనికిచర్ల, ధర్మసాగర్ మీదుగా హైదరాబాద్ నేషనల్ హైవేకు 100 ఫీట్ల హైవే రోడ్డు పనులు సైతం కాంట్రాక్టర్ పూర్తి చేశాడన్నారు. అయితే ఎస్‌ఆర్ వర్శిటీ యాజమాన్యం హైవే రో డ్డును ఆక్రమించి హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల హై వే లోని ఆ ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డు కేవలం 40 ఫీట్ల కు పరిమితమైంది.

కాగా, హైవేను ఆనుకొని ఉన్న అనంతసాగర్, మడిపల్లి, ఉనికిచర్ల, ధర్మసాగర్ గ్రామాలకు చెందిన రైతులు రోడ్డుకు చేర్చి ఉన్న స్థలాలను వదిలివేయడంతో హైవే రోడ్డు పనులు వేగంగా పూర్తయ్యాయి. హైవే క్రాస్‌లో ఉన్న ఎస్‌ఆర్ వర్శిటీ వద్ద కు వచ్చే సరికే సర్వీసు రోడ్డు మొక్కలు నాటడం కోసం ఉంచిన 30 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి రోడ్డు పనులకు ముందే ఫెన్సింగ్‌వాల్‌ను నిర్మించడంతో వర్శిటీ ప్రాంతంలో రోడ్డు కుచించుకుపోయింది. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఎస్‌ఆర్ యాజమాన్యం రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన స్థలంలో ఫెన్సింగ్‌ను వెంటనే తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలని అఖిపక్ష నాయకులు డిమాండు చేస్తున్నారు.

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

రోడ్డు స్థలాన్ని అక్రమంగా ఆక్రమిం చి ప్రభుత్వ నిబంధనలను తుం గలో తొక్కి వాహనదారులు, గ్రామస్తులను భంగం కలిగిస్తున్న ఎస్‌ఆర్ వర్శిటీ యాజమాన్యంపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఆక్రమించిన రోడ్డు స్థలాన్ని కాపాడాలి.

                                                                  డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్

ఎస్‌ఆర్ వర్శిటీకి కొమ్ముకాస్తున్న అధికారులు

రోడ్డు స్థలాన్ని యధేచ్ఛగా ఆక్రమించిన ఎస్‌ఆర్ వర్శిటీ యాజమాన్యం పై ప్రభుత్వ అధికారులు ఎందుకు చ ర్యలు తీసుకోవడంలేదని హసన్‌పర్తి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి గిన్నారపు రోహిత్ నిలదీశారు. అధికారుల అండదండల వల్లే ఎస్‌ఆర్ యాజమాన్యం రోడ్డు స్థలా న్ని ఆక్రమించిందని, దీనిపై అధికారులే ఎస్‌ఆర్ వర్శిటీ యా జమాన్యానికికొమ్ముకాస్తున్నారని అర్థమవుతుందన్నారు.

                                                                                     హసన్‌పర్తి మండల సిపిఐ పార్టీ కార్యదర్శి
                                                                                            గిన్నారపు రోహిత్

డిపిఒ తక్షణమే చర్యలు తీసుకోవాలి

హైవే రోడ్డు స్థలాన్ని కబ్జాచేసిన ఎస్‌ఆర్ యూనివర్శిటీ యాజమాన్యంపై హనుమకొండ జిల్లా జిల్లా పంచాయతీ అధికారి తక్షణమే చర్యలు తీ సుకోవాలని వర్ధన్నపేట నియోజకవర్గ బహుజన సమాజ్‌పార్టీ అధ్యక్షు డు చాతళ్ల వేణుగోపాల్ అన్నారు. ఇలాంటి భూ ఆక్రమణలకు ఎవరు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని ఆక్రమించిన స్థలాన్ని కాపాడాలి

                                                                                వర్ధన్నపేట నియోజకవర్గ బిఎస్‌పి
                                                                                  అధ్యక్షుడు చాతళ్ల వేణుగోపాల్

ప్రభుత్వ స్థలాలను కాపాడాలి

అనంతసాగర్ క్రాస్ రోడ్డులో ఎస్‌ఆర్ వర్శిటీ యాజమా న్యం రోడ్డు స్థలా న్ని ఆక్రమించడమే కాక ఫెన్సింగ్ నిర్మించడం సరైంది కాదు.. భూ ఆక్రమణలకు ఎవరు పాల్పడిన వారిపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకోని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని హసన్‌పర్తి మండల బిజెపి అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి అన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి

                                                                     – హసన్‌పర్తి మండల బిజెపి అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి  ఎస్‌ఆర్ ఆక్రమణకు పాల్పడడం సిగ్గుచేటు

విద్యార్థులను క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించే విద్యా సంస్థ ఎస్‌ఆర్ యూనివర్శిటీ యాజమాన్యం రోడ్డు స్థలాలను ఆక్రమించడం సిగ్గు చేటని హసన్‌పర్తి మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఎస్‌ఆర్ యాజమాన్యం రాబోయే తరానికి ఆదర్శంగా ఉంటూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించకుండా ఉన్న దాంట్లో విద్యా వవస్థను నడుపుకోవాలని సూచించారు.
హసన్‌పర్తి మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టె శ్రీనివాస్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News