మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం వెంకటాపురం పాగుంటా లక్ష్మీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైతు సంబరాలు నిర్వహించారు. రైతు సంబరాలను పురస్కరించుకుని ఆదివారం వెంకటాపురం క్రీడాప్రాంగణంలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటిదొడ్డి జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపిపి రామకృష్ణనాయుడు, పాగుంటా ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి హాజరై ఎడ్ల పందాలు ప్రారంభించారు. మొదటిరోజు 6 పళ్ల విభాగంగాలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వృషభరాజులు ఈ పోటీలో పాల్గొన్నాయి. పోటీలో గెలుపొందిన వృషభరాజులకు ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాలుగవ బహమతి రూ.15వేలు, అయిదవ బహుమతి రూ.10 వేలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరలో రైతు సంబరాలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు నూతనోత్సహం నింపుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమల రంగంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పోటీలోను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ధరూర్ ఎంపిపి నజ్మునిసాబేగం, ఆలయ కమిటీ డైరెక్టర్ రాజేష్, సర్పంచుల సంఘం మండాలధ్యక్షుడు ఆంజనేయులు, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఉరుకుందు, యూత్ అధ్యక్షుడు నక్క శేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు చక్రధర్, మైలగడ్డ శేఖర్, రంగారెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.