లండన్: ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న పెద్దవారిలో రక్తం గడ్డకడుతున్నట్టు అనేక దేశాల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ప్రపంచం లోని 150 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి రాగా, 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రస్తుతం టీకా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 నుంచి 17 ఏళ్ల లోపు వయసు గల 300 మంది చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నారు. అయితే ఐరోపా దేశాల్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విధంగా రక్తం గడ్డ కట్టినట్టు 30 మందిని గుర్తించగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ పరిస్థితి కారణంగా అనేక దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాయి.
చిన్నారులపై ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాల నిలిపివేత
- Advertisement -
- Advertisement -
- Advertisement -