న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఇలాంటి కష్ట కాలంలో 70 టన్నులతో తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధానికి చేరుకుందని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఈ ఆక్సిజన్‌ను ఢిల్లీ ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేస్తుందని వారు తెలిపారు. సార్ గంగా రామ్ ఆసుపత్రికి 2 టన్నుల ఆక్సిజన్ ను సరఫరా చేసినట్టు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గడ్ లోని రాయ్‌గడ్ నుండి రెండు రోజుల క్రితం బయలు దేరిన ఎక్స్‌ప్రెస్ రైలు ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్. దేశరాజధానిలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఇప్పటివకే ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యల్లో కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంగూల్, కాలింగ్‌నగర్, రూర్కెలా, రాయ్ గడ్ నుంచి ఆక్సిజన్ తరలించేందుకు రైల్వే ఏర్పాటుచేసింది. అయితే, రెండవ ఆక్సిజన్ రైలుపై ఎలాంటి సమాచారం లేదని రైల్వేశాఖ పేర్కొంది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35% పైగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఢిల్లీకి చేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -