- Advertisement -
న్యూఢిల్లీ: వారం రోజుల్లో జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లను యుద్ధ విమానాల ద్వారా తీసుకురానున్నట్టు రక్షణశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కో ప్లాంట్ నిమిషానికి 40 లీటర్ల చొప్పున గంటకు 2400 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు రక్షణశాఖ ముఖ్య అధికార ప్రతినిధి ఎ.భరత్‌భూషన్‌బాబు తెలిపారు. మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లను కొవిడ్19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఆర్మ్‌డ్ పోర్సెస్ మెడికల్ సర్వీసెస్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి మరిన్ని ప్లాంట్లను తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్టు బాబు తెలిపారు. వాటిని తరలించడం తేలికని ఆయన అన్నారు.
- Advertisement -