Sunday, November 17, 2024

ఢిల్లీలో ఆక్సిజన్ కొరత.. ఆందోళనలో కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Oxygen shortage in Delhi Says Arvind Kejriwal

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడం, బెడ్ల కొరతతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు లభ్యత తగ్గిపోయింది. మరికొన్ని గంటలకు మించి ఉండబోవని ఆస్పత్రి యాజమాన్యాలు చేతులెత్తేశాయి. ఈ పరిస్థితిపై సిఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఢిల్లీ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంచాలని కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించి కేంద్రం యుపి ప్రభుత్వంతో చర్చించి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను పున:ప్రారంభించింది. అర్థరాత్రి ఒంటిగంటన్నర తర్వాత ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నారు. అయితే కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆ స్టాక్ కూడా కొన్ని గంటల వరకే ఉంటుదని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

Oxygen shortage in Delhi Says Arvind Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News