- Advertisement -
న్యూఢిల్లీ : గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో దక్షిణ భారతదేశంలో హోటళ్లు, హోమ్‌లను పెంచుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఓయో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 1,350 ప్రాపర్టీలను నిర్వహిస్తుండగా, ఈ ప్రాంతంలో తన స్టోర్ ఫ్రంట్‌లను 500-700 వరకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 2022 నాటికి దక్షిణ భారతదేశంలో 600 కొత్త హోటళ్లు, హోమ్‌లు ప్రారంభించాలని ఓయో లక్షంగా చేసుకుంది. ఓయో ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన కొత్త హోటళ్లు తమ రాబడిని రెట్టింపు చేసుకున్నాయి. ఓయోకు సంబంధించిన టాప్ 10 వ్యాపార మార్కెట్లలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.
- Advertisement -