Sunday, December 29, 2024

ఆ పుట్టగొడుగు మాంసాహారి

- Advertisement -
- Advertisement -

ఆ పుట్టగొడుగు హార్రర్ సినిమాలా పూర్తి రక్త పిపాసి.. గుండ్రని పురుగులను భక్షించే మాంసాహారి. ఆ పుట్టగొడుగు గుల్లగా ఉన్నా పూర్తిగా రక్తంతో నిండి ఉంటుంది. తన నరాల వాయువులతో పురుగులను చంపి ఆకలి తీర్చుకుంటుంది. వీటిని ఓస్టర్ పుట్టగొడుగులు అని అంటారు. సాధారణంగా పుట్టగొడుగులు పోషక విలువల పదార్థాలు కలిగి రుచిగా ఉంటాయి. అలా అనుకొని మోస పోవద్దు. ఇవి నులి పురుగులను , చిన్న గుండ్రని పురుగులను చంపేస్తాయి.

ప్లురోటస్ ఓస్టరేటస్ (pleurotus ostreatus) అనే ఈ పుట్టగొడుగులు సాధారణంగా చచ్చిన క్రిములపై లేదా చచ్చిపోతున్న చెట్లపై ఆధార పడి జీవిస్తాయి. ఇవి పొడవాటి పోగులు కలిగిన ఫంగస్‌తో కూడిన సూక్ష్మమైన బంతులు వంటి వాటిని ఉపయోగించి పురుగులను చంపుతాయి. నులిపురుగులుపై దాడి చేసి క్షణాల్లో చంపుతాయి. దీని ఫంగస్ పోగులు మృత కళేబరాలను దొలిచి వేసి, లోపలి కండరాలను నీరులా కరిగించి, వాటి పోషకాలను మింగుతాయి. వీటిపై ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వీటి లక్షణాలు బయటపడ్డాయి.

బంతిలా ఉండే ఈ పుట్టగొడుగు ఫంగస్ ప్రాణాంతక మైన నరాల వాయువును విడుదల చేసి ప్రాణిని చంపుతుందని కనుగొన్నారు. ఈ నరాల ఏజెంట్‌ను 3 ఆక్టనోన్ అని అంటారు. ఇది నులి పురుగుల నరాలు, కండరాల్లోకి భారీ ఎత్తున విషపూరిత కాల్షియం ఐయాన్ల ప్రవాహాన్ని పంపుతుంది. దాంతో నులిపురుగులు అచేతనమై చివరకు చనిపోతాయి. పంటలపై దాడి చేసే నులిపురుగులను నాశనం చేయడానికి ఈ రకం పుట్టగొడుగులను ఉపయోగించ వచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News