Sunday, January 19, 2025

చిన్నగా మారుతున్న ఓజోన్ రంధ్రం

- Advertisement -
- Advertisement -
Ozone Hole
వాతావరణ మార్పు వల్ల భూమికి చిగురిస్తున్న కొత్త ఆశ

న్యూఢిల్లీ: శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువం ప్రస్తుత పరిస్థితిని వెల్లడిస్తూ ఓజోన్ రంధ్రం  కుంచించుకుపోతున్నదన్నారు.  అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13, 2022 మధ్య సగటు 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరుకుంది. దక్షిణ ధ్రువంపై ప్రస్తుత అంచనా గత సంవత్సరం కంటే కొంచెం కుంచించుకుపోయింది, సాధారణంగా ఇటీవలి సంవత్సరాలలో తగ్గిపోతున్న ధోరణిని కొనసాగించింది. 2021 అంచనాల ప్రకారం ఓజోన్ రంధ్రం 24.8 మిలియన్ చదరపు కిలోమీటర్ల వద్ద ఉంది.

ఓజోన్,  అంటార్కిటికా పైన ఉన్న స్ట్రాటో ఆవరణలో ఓజోన్ పొర సన్నబడటం అన్నది ప్రతి సెప్టెంబరులో జరుగుతుంది.  మానవ-ఉత్పత్తి సమ్మేళనాల నుండి ఉత్పన్నమైన క్లోరిన్ బ్రోమిన్ యొక్క రసాయన క్రియాశీల రూపాలు ఎత్తైన మేఘాలపై విడుదలవుతుంటాయి.

“కాలక్రమేణా, స్థిరమైన పురోగతి జరుగుతోంది, ఓజోన్ రంధ్రం చిన్నది అవుతోంది. వాతావరణ మార్పులు, ఇతర కారకాల సంఖ్యలు రోజు  రోజుకు తగ్గుతుండడం మనం చూస్తాము. కానీ మొత్తంమీద, గత రెండు దశాబ్దాలుగా ఇది తగ్గుముఖం పట్టడం మనం చూస్తున్నాం. మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఓజోన్-క్షీణించే పదార్ధాల తొలగింపు రంధ్రం తగ్గిపోతోంది ”అని నాసా యొక్క గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లోని ఎర్త్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ పాల్ న్యూమాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News