Monday, December 23, 2024

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయినా నా ఇంట్లో సోదాలు : చిదంబరం

- Advertisement -
- Advertisement -

P Chidambaram Responded on CBI searches

న్యూఢిల్లీ : ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకపోయినా సిబిఐ అధికారులు తన ఇంట్లో సోదాలు నిర్వహించారని కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. మంగళవారం ఆయన కుమారుడు కార్తి చిదంబరం ఇళ్లపై సిబిఐ సోదాలు నిర్వహించిన తరువాత చిదంబరం స్పందించారు. ఈరోజు ఉదయం చెన్నై లోని నా నివాసంలో ఢిల్లీ లోని నా అధికారిక నివాసంలో సీబిఐ బృందం సోదాలు నిర్వహించింది. సిబిఐ అధికారులు నాకు ఒక ఎఫ్‌ఐఆర్ కాపీని చూపించారు. అయితే అందులో నేను నిందితుడనని లేదు. వచ్చార సోదా చేశారు. వాళ్లకు ఏమీ దొరక లేదు. వాళ్లేమీ సీజ్ చేయలేదు. అయితే ఒకటైతే నేను గమనించాను. వాళ్లు సోదాలు చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది అనే అర్థంలో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News