Monday, December 23, 2024

కాంగ్రెస్ స్థానం కీలకం…విపక్ష నేతపై తొందరెందుకు

- Advertisement -
- Advertisement -

న్యూడిల్లీ : ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్‌కు ఉన్న విశిష్టత తిరుగులేనిదని, ఇది ఎప్పుడూ స్పష్టం అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తెలిపారు. సోమవారం బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశం నేపథ్యంలో ఆయన వార్తా సంస్థలతో మాట్లాడారు. ప్రతిపక్షాలు సంఘటితంగా నిలిస్తే ఇది నిజంగానే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మోడీకి సవాలు అవుతుందని తెలిపారు. యాంటి బిజెపి కూటమి నేత ఎవరనేది త్వరలోనే తేలుతుందన్నారు. ప్రతిపక్ష శిబిరాలలో కాంగ్రెస్ గుర్తింపు ఉండనే ఉంది, దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ గురించి ప్రస్తావించారు. పాట్నాలో విపక్ష భేటీ దశలో ప్రతిపక్షాల ప్రత్యేకించి కాంగ్రెస్ నుంచి మద్దతు తీసుకునే విషయంలో ఆప్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు.

పలు విషయాలు ఉంటాయి. వేటికి వాటిని వాటివాటి స్థాయిలను బట్టి బేరీజువేసుకోవల్సి ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు పలు ఉమ్మడి లక్షాలు ఉన్నాయి. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత సామాజిక , ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తున్నాయి . ఈ క్రమంలో విపక్షం ఒక్కటి కావడం జరుగుతుంది. జరగాల్సిందే. ఇదే దశలో కాంగ్రెస్‌కు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి లేదా సంఘటిత ప్రతిపక్ష నేత ఎవరనేది కాలక్రమంలో తేల్చుకోవచ్చునని, ముందు ఐక్యత సాధించుకోవల్సి ఉందన్నారు. ప్రతిపక్ష ఐక్యత సాధనే భేటీకి ముఖచిత్రం అవుతుంది. తరువాతనే నేత ఎవరనేది గోచరిస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News