Wednesday, January 22, 2025

హిందూ బడ్జెట్..ముస్లిం బడ్జెట్ అని ఉంటాయా?

- Advertisement -
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీలకు 15 శాతం వాటా కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం గురువారం మండిపడ్డారు. ప్రధాని మోడీ ప్రకటనను దారుణం పచ్చి అబద్ధంగా ఆయన అభివర్ణించారు. గత 75 ఏళ్లుగా ఒకే ఒక వార్షిక ఆర్థిక ప్రకటన(బడ్జెట్) ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు. హిందువులకు ఒకటి..ముస్లింలకు ఒకటి అంటూ రెండు బడ్జెట్‌లు ఎలా ఉంటాయి? ఇది చాలా దారుణం. పచ్చి అబద్ధం. బిజెపి ఎందుకు భ్రమిస్తోంది? అంటూ చిదంబరం ప్రశ్నించారు.

ప్రధాని మోడీ ప్రసంగ రచయితలు సంయమనం కోల్పోయినట్లు కనపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ బడ్జెట్, ముస్లిం బడ్జెట్ అంటూ ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రేపు క్రిస్టియన్ బడ్జెట్ లేదా సిక్కు బడ్జెట్ అని కూడా ఉంటుందా అని ఆయన నిలదీశారు. భారత రాజ్యాంగంలో 112 అధికరణ ప్రకారం ప్రభుత్వం ఏడాదికి ఒకసారి పార్లమెంట్‌లో ఆదాయ వ్యయాల ప్రకటనను వార్షిక ఆర్థిక ప్రకటన(ఎఎఫ్‌ఎస్) పేరిట సమర్పించాల్సి ఉంటుందని చిదంబరం వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News