న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తన మేనిఫెస్టో కమిటీని శనివారం పునర్వవస్థీకరించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరంను కాంగ్రెస్ నియమించింది. కమిటీ కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్‌ను కాంగ్రెస్ నియమించింది. 16 మంది సభ్యులతోకూడిన మేనిఫెస్టో కమిటీలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు చోటు దక్కింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశం జరిగిన మరుసటి రోజే మేనిఫెస్టో కమిటీ పునర్వస్థీకరణ ప్రకటన జరగడం విశేషం. సిడబ్లుసి సమావేశంలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించిన కాంగ్రెస్ త్వరలోనే అభ్యర్థలు పేర్లను ప్రకటించనున్నది.
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేష్, శశి థరూర్ కూడా మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మణిపూర్ మాజీ ఉప ముఖ్యమంత్రి గైఖంగం, లోక్‌సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్‌ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ చక్రవర్తి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ అజెండాను రూపొందించే ఈ కీలక కమిటీలో పార్టీ నాయకులు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె రాజు, ఓంకార్ సింగ్ మార్కమ్, రంజీత్ రంజన్, జిగ్నేష్ మేవాని, గుర్దీప్ సప్పల్ ఇతర సభ్యులు.