Thursday, November 14, 2024

పివికి భారత రత్న…… జీవిత విశేషాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగుబిడ్డ, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న అత్యున్నత పురష్కారం రావడం పట్ల రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు, చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు  భారత రత్న పౌర పురష్కారం ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన 28న రుక్మాబాయమ్మ-సీతారామారావు అనే పుణ్య దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. పివికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్య హనుమకొండలో పూర్తి చేశారు. ఉస్మానియ యూనివర్సిటీ నుంచి బిఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. నాగ్‌పూర్ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం, అలహాబాద్‌లో సాహిత్య రత్నను అభ్యసించారు.

1957లో మంథని నుంచి ఎంఎల్‌ఎగా గెలిచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1972లో ఉమ్మడి ఎపికి సిఎంగా పివి సేవలందిండంతో పాటు పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం తీసుకొచ్చారు. 1977లో హనుమకొండ నుంచి ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలుగువాడు ప్రధాని కావడం గర్వకారణంగా ఉందని దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ ప్రశంసించడంతో 1991లో ఎంపిగా పోటీ చేసిన పివిపై పోటీ పెట్టకుండా మద్దతు పలికారు. నంద్యాల నుంచి ఎంపిగా ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధిక మెజార్టీతో సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పివి చోటు సంపాదించారు. ఇందిరా, రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 1991 నుంచి 1996వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పని చేశారు.

ప్రధానిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెరిపిన నేతగా పేరుగాంచారు. సరళీకరణ ఆర్థిక విధానం ద్వారా ఎఫ్‌డిఐలకు నాంది పలకడంతో పాటు ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా వాజ్‌పేయీని పంపిన ఘనత పివికి దక్కుతుంది. భారత అణు కార్యక్రమానికి పితామహుడు పివి, ఆర్థిక సంక్షోభం నుంచి భారత దేశాన్ని గట్టెక్కించిన గొప్పనేత పివి అని ప్రశంసించారు. 1991లో భారత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం పడిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే అనేక సంస్కరణలకు పివి శ్రీకారం చుట్టారు. 1992లో ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్‌డిఐలకు అనుమతించారు. 17 భాష్లలో అనర్గళంగా మాట్లాడడంతో బాహుభాషా కోవిదుడిగా పివికి గుర్తింపు ఉంది. 2004లో పివి గుండెపోటుతో కన్నుమూశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News