Thursday, December 26, 2024

పివి వరంగల్ బిడ్డ కావడం మన అదృష్టం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

 

హనుమకొండ : దేశ ప్రధానిగా గొప్ప సేవలు అందించి, దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకులడు పూర్వ ప్రధాని పి.వి నరసింహారావు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశంసించారు. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంత్రి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గొప్ప నిజాయితీ గల నాయకుడు పివికి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా ముందుకెళ్లిందనీ, చాలా నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఇంతటి గొప్ప వ్యక్తి వరంగల్ బిడ్డ కావడం, తెలంగాణ వారు కావడం, తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రధానిగా ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి? అని నిరూపించిన మహానుభావుడు పివి నరసింహారావు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News