Monday, December 23, 2024

చంద్రముఖిలో లకలకలక శబ్దం ఎలా పుట్టిందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీ జీవితంలోనే అతి పెద్ద హిట్ చిత్రం చంద్రముఖి. తమిళ భాషలో రూపొందిన చంద్రముఖి తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలైనప్పటికీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. శివాజీ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ప్రభు, జ్యోతిక, నయనతార నటించిన ఈ చిత్రానికి పి వాసు దర్శకుడు. విజయ వాహిని నిర్మాణ సంస్థ నిర్మించిన పాలతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ వంటి అనేక చిత్రాలకు పర్మనెంట్ చీఫ్ మేకప్‌మెన్‌గా పనిచేసిన పీతాంబరం కుమారుడే ఈ పి వాసు.

నందమూరి తారక రామారావును పర్సనల్ మేకప్‌మేన్‌గా తుదివరకు పనిచేసిన పీతాంబరం ఎన్టీఆర్ హఋరోగా అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ వంటి చిత్రాలను కూడా నిర్మించారు. చిన్నతంబి(చంటి), వేలై కడిచిడిచు(అసెంబ్లీ రౌడీ), నడిగన్(పెద్దింటల్లుడు, వాల్టర్ వెట్రివేల్(ఎస్‌పి పరశురాం) తదితర అనేక సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు వాసు. చంద్రముఖి చిత్రానికి సంబంధించిన నిర్మాణ విశేషాలను పి వాసు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ ముచ్చట్లు మీ కోసం..

మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన మణి చిత్రతాళు అనే చిత్రాన్ని 2003లో ఒక రోజు ఇంట్లో కాకతాళీయంగా చూడడం జరిగింది. అప్పటికే ఆ చిత్రాన్ని నా నాలుగేళ్ల కూతురు కూడా చూసేసింది. ఒంటరిగా కూర్చుని ఆ సినిమా చూశాను. స్ప్లిట్ పర్సనాలిటీకి సంబంధించిన ఆ కథను మలయాళ దర్శకుడు ఫాజిల్ ఒక దృశ్యకావ్యంగా మలచారు. నాగవల్లి పాత్రలో శోభన అద్భుతంగా నటించింది. అనేక అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రాన్ని తమిళంలోకాని. మనూ ఇతన భాషల్లో కాని ఆదరిస్తారా అని నాకు అనిపించింది.

మరుసటి రోజు ఉదయం బాత్‌రూమ్‌లో నేను స్నానం చేస్తుండగా తలుపు మీద దడదడదడదడదడ మంటూ శబ్దం వినిపించింది. ఎవరది అంటూ గట్టిగా అరిచాను. కాని మళ్లీ అదే శబ్దం వినిపించింది..మళ్లీ రెట్టించి ఎవరని అడిగాను. నాందాన్డా నాగవల్లీ.. అంటూ బొంగురుపోయిన గొంతు వినిపించింది. వెంటనే తులుపు తెరచి చూస్తే నా నాలుగేళ్ల కూతురు కనిపించింది. షాక్ అయిపోయాను. ఇంత చిన్న పిల్లను ఈ సినిమా ఇంత ప్రభావితం చేసిందంటే ఈ సినిమాలో ఏదో మేజిక్ ఉందనుకున్నాను.

బెం ఒక కన్నడ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లినపుడు కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్‌ని కలిశాను. మాటల సందర్భంలో ఆయన ఇప్పుడు హారర్ చిత్రాల సీజన్ నడుస్తోంది..అలాంటిది ఏదైనా మనమిద్దరం ప్లాన్ చేస్తే బాగుంటుందని అన్నారు. ఆయనకు అప్పుడు మణిచిత్రతాళు గురించి చెప్పాను. ఆయన ఆసక్తి చూపారు. అయితే హీరో ఇంట్రడక్షన్ ంటర్వెల్ ముందు ఉంటుందని అనగానే ఆయన అలాగైతే కష్టమని చెప్పారు. కథను పూర్తిగా మార్చి మీకు చూపిస్తానని ఆయనకు చెప్పి వచ్చేశాను.

మద్రాసు రాగానే ఆ చిత్ర నిర్మాతలను సంప్రదించి రూ. 75వేలకు కన్నడ రైట్స్ కొన్నాను. అయితే కథలో మార్పులు చేర్పులు చేసుకుంటానని అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందే వాళ్లకు చెప్పేశాను. ఆ ప్రకారంగానే విష్ణువర్ధన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి కన్నడలో ఆప్తమిత్రగా తెరకెక్కించాను. అది సూపర్‌హిట్ అయింది. సిల్వర్‌జుబిలీ ఆడింది.

శఙవాజీ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయడానికి రజనీకాంత్ డేట్స్ ఇచ్చాని హీరో ప్రభు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ సినిమాకి మీరే డైరెక్టర్ అని చెప్పేశాడు. రజనీకాంత్ కోసం ఒక కొత్త కథ తయారుచేసే పనిలో పడ్డాను. ఒకరోజు రజనీకాంత్‌ను కలిసినపుడు కొత్త కథ వద్దు ఆప్తమిత్రనే తమిళంలో చేద్దామని ఆయన చెప్పారు. అయితే రజనీకాంత్ ఇమేజ్‌కు ఆ కథ సరిపోదని నాకు గట్టిగా అనిపించింది. ఇదే విషయం ఆయనకు చెప్పాను. ఆయన మాత్రం ఎలాంటి మార్పులు చేస్తే బాగులుంటుందో ఆలోచించమని చెప్పారు. అప్పుడు తీసుకువచ్చిందే వడివేలు, షీలా, సోనూసూద్ పాత్రలు. మలయాళంలో నాగవల్లి పాత్ర భర్త మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అందులో రాజు పాత్ర ఉండదు. వీటిని కన్నడ, తమిళంలో చేరచాను. మూలకథకు భంగం కలగకుండా చాలా మార్పులే చేశాను. అయితే రజనీకాంత్ పోషించే చంద్రముఖి భర్త వేట రాజు పాత్రకు ఒక మేనరిజం ఉండాలని భావించాను. అది ఎలా ఉండాలన్న దానిపై మేము తర్జనభర్జన పడుతున్న సమయంలో రజనీకాంత్ హిమాయాల్లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించారు.

ఒక రోజు రాత్రి 11 గంటలకు తాను బయట తిరుగుతుండగా తనకు లకలకలక అంటూ ఒక విచిత్రమైన శబ్దం వినిపించిందని రజనీ చెప్పారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవానికి తాను చాలాసేపు గాలించానని, కాని తనకు అంతుచిక్కలేదని ఆయన చెప్పారు. మరుసటి రోజు తనకు ఆరదుగులకు పైనే ఉన్న ఒక సాధువు గాలిలో చూస్తూ లకలకలక అంటూ విచిత్రంగా శబ్దం చేయడం కనిపించిందని, ఆ సాధువు నోటితో ఢమరుకం శబ్దం చేస్తూ ఆకాశంలో శివుడిని పిలుస్తున్నట్లు తాను భావించానని రజనీ చెప్పడంతో..ఆ మేజనిరజమే కరెక్ట్ అని నిశ్చయించుకున్నాను.

మరుసటి రోజు ఉదయం రజనీ ఇంటికి వెళ్లినపుడు ఆయన ఒక్క క్షణం అంటూ పది అడుగులు ముందుకు నడిచి హఠాత్తుగా వెనక్కి తిరిగిచూస్తూ లకలకలక అంటూ శబ్దం చేస్తూ నటించి చూపడంతో షాక్ అయిపోయాను. చివరలో పళ్లతో కరుస్తున్నట్లు ఆయన చూపిన హావభావాలు చూసి ఇదే ఈ చిత్రానికి హైలైట్ అయిపోతుందని, దేశమంతా లకలకలక మేనరిజమ్ మారుమోగిపోతుందని ఆ క్షణమే నాకు అనిపించింది. రజనీకాంత్ నమ్మకం వమ్ముకాలేదు. 2005 ఏప్రిల్ 14న విడుదలైన చంద్రముఖి చిత్రం ఆయన నటజీవింలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోయింది..అని చెప్పారు పి వాసు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News