- Advertisement -
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముద్దుల తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు(మార్చి 13) పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ లో నేలపై 12 అడుగుల కాయిన్స్ వినూత్నంగా చిత్రించారు. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై “హ్యాపీ బర్త్ డే కవితక్క” అని రాశారు. నేలపై కాయిన్స్ (నాణాలతో) 12 అడుగుల వినూత్న చిత్రాన్ని నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ ఏర్పాటుజేశారు. ప్రతీసారి వినూత్నంగా నిర్వహించే పబ్బ సాయిప్రసాద్ ఈసారి కూడా విభిన్నంగా బర్త్ డే విషెష్ చెప్పారు.
Pabba Sai Prasad Special birthday Wishes to MLC Kavitha
- Advertisement -