Tuesday, April 8, 2025

అయోధ్య రామ మందిర్‌లో పొరపాటున పేలిన తుపాకీ

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో విధి నిర్వహణలో ఉన్న ఒక ప్రొవిన్షియల్ ఆర్డ్ కానిస్టేబులరీ (పిఎసి) కమాండో తన గన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాథ్తు అది పేలవిపోవడంతో గాయపడ్డాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ప్లాటూన్ కమాండర్ రాం ప్రసాద్(50)ను అయోధ్య వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు వారు చెప్పారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా అవసరాల నిమిత్తం రాం ప్రసాద్ రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో గత ఆరు నెలలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

తన భద్రతా పోస్టులో ఆయుధాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో అది పేలి రాం ప్రసాద్ గాయపడ్డారని సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాం ప్రసాద్ ఛాతీకి ఎడమమ వైపున బుల్లెట్ తగిలిందని అయోధ్యలోని మెడికల్ కాలేజ్ ఎమర్జెన్సీ విభాగం ఇన్‌చార్జ్ డాక్టర్ వినోద్ కుమార్ ఆర్య బుధవారం తెలిపారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో లక్నోలోని కెజిఎంయుకు తరలించినట్లు ఆయన చెప్పారు. రాం ప్రసాద్ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ జిల్లా అచల్‌పూర్ గ్రామ వాస్తవ్యుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News