Thursday, November 14, 2024

12 పాకో మెషీన్లు ఏర్పాటు చేశాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ రోజు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వేదికగా పాకో మెషీన్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాటరాక్ట్ సర్జరీల నిర్వహణలో ఈ అత్యాధునిక యంత్రాలు ఎంతో సహాయం చేయనున్నాయని చెప్పారు. అల్ట్రా సౌండ్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రాల ద్వారా సర్జరీలు సులభంగా, వేగంగా చేసేందుకు అవకాశం లభిస్తుందని, సర్జరీ తర్వాత రోగులు కూడా తొందరగా కోలుకుంటారని వివరించారు.

Also Read: మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 యంత్రాలను ఏర్పాటు చేశామని, వీటన్నింటినీ ఒకేసారి ఇప్పుడు ప్రారంభించుకున్నామని, సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కూడా రెండు మెషిన్లు ఏర్పాటు చేశామని, మలక్ పేట ఏరియా ఆస్పత్రిలోను ఒక యంత్రం అందుబాటులోకి వచ్చిందని, మిగతా 9 జిల్లాలు మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఒక్కో యంత్రం అందుబాటులోకి వచ్చిందని హరీష్ రావు చెప్పారు. ఒక్కో యంత్రం ఖరీదు 28 లక్షల 85 వేల రూపాయలుండగా, మొత్తంగా 12 యంత్రాలకు కలిపి ప్రభుత్వం 3 కోట్ల 46 లక్షలు ఖర్చు చేసిందన్నారు. ప్రైవేటులో 30 నుండి 40 వేలు అయ్యే సర్జరీ పేదలకు ఉచితంగా అందిస్తున్నామని, సర్జరీ నిర్వహించడానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంటి సమస్యలు గుర్తించిన వారికి ఈ ఫాకో మిషన్ల ద్వారా అవసరమైన చికిత్స అందిస్తామని హరీష్ రావు వివరణ ఇచ్చారు.

అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం అని, రెండు దఫాల్లో విజయవంతంగా పూర్తి చేశామని, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారని, అంతటి ముఖ్యమైన కళ్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, స్కూల్ కు వెళ్లే విద్యార్థి నుంచి, పండుముసలి వరకు కంటి సమస్యలతో బాధపడుతుంటారన్నారు. చిన్న సమస్యే కదా అని వదిలేస్తూ, కాలం గడుపుతుంటారని, చివరకు అది పెద్ద సమస్యకు దారి తీస్తుందన్నారు. దీన్ని దృష్టిలోఉంచుకొని సిఎం కెసిఆర్ కంటివెలుగు అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు విజయవంతంగా అమలు చేశారని హరీష్ రావు ప్రశంసించారు.

ఎవరూ అడగకముందే, ఇంటి పెద్దకొడుకుగా ఆలోచించిన కెసిఆర్ ప్రజల కంటిసమస్యలను దూరం చేసేందుకు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదని కొనియాడారు. 100 పని దినాల్లో కోటి 62 లక్షల మందికి కంటి పరీక్షలు చేశామని, ఇందులో దృష్టి లోపం ఉన్న 40.59 లక్షల మందికి అంటే 25.1 శాతం మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరగిందన్నారు. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించామని, 18.08 లక్షల ప్రిస్కిప్షన్ అందాలు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, మందులు పంపిణీ చేసిన ఘనత బిఆర్ ఎస్ కు తప్ప ప్రపంచంలో మరే ప్రభుత్వానికి లేదన్నారు.

కంటి పరీక్షల్లో మాది ఆల్ టైం రికార్డ్..

మీతో ఒక విషయం పంచుకోవాలి అనుకుంటున్నానని, ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి స్థాపకులు, ప్రపంచ ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావుగారు మొదటి విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగానని, ఎన్నో సదస్సులు హాజరయ్యానని, కానీ, కంటి సమస్యలపై దృష్టిసారించి, ఇంత పెద్దఎత్తున కంటిపరీక్షలు నిర్వహించడం ఎక్కడా చూడలేదని నాగేశ్వర్ రావు చెప్పడం గొప్ప విషయమన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపించారని, తన హృదయం ఉప్పొంగిపోయిందని తన సంతోషాన్ని పంచుకున్నామని, అంతటి గొప్ప కార్యక్రమం కంటివెలుగు అని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News