Saturday, December 21, 2024

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీల్లో పాదయాత్ర : సుభాష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిక్షరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబనగర్, ఇందిరనగర్‌కాలనీ, సాయారాంనగర్ కా లనీల్లో అధికారులు కాలనీవాసులతో కలిసి మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటివద్ద అగి సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరిక్షరించారు. ముఖ్యంగా కాలనీలో రహదారులపై నీరు నిలువకుండా సరైన డ్రైనేజీ వ్యవస్ధను ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణం చేయాలని, కాలనీలో ఎత్తైన ప్రాంతాలకు మంచీనీరు లోఫ్రెషర్ స మస్య ఉందని, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను ఆధునీకరించాలని వీధి దీపాల ఏర్పాటు రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మార్‌ను తరలించి కంటే ఏర్పాటు చేయడం, పారిశుధ్య నిర్వహణ, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ప్లోరింగ్, పెంయిటింగ్, పించన్లు వంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సాయిబాబనగర్ కాలనీ వాటర్‌ట్యాంక్ వద్ద అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలను వెంటనే పరిక్షరించాలని అదేశించారు. ఈసందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిక్షరిస్తానని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిక్షరం కోసమే కాలనీల్లో పాధయాత్ర చేస్తున్ననని తెలిపారు. ఈకార్యక్రమంలో కాప్రా, మీర్‌పేట్ హెచ్‌బికాలనీ డివిజన్ కార్పొరేటర్లు స్వర్ణరాజు, జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి దన్‌పాల్‌రెడ్డి, గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, వివిద విభాగాల అదికారులు పార్టీ డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్‌రెడ్డి, గిల్‌బర్ట్ ఉప్పల్ నియోజకవర్గంలో ని పది డివిజన్లకు చెందిన బిఅర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News