Wednesday, January 22, 2025

అంచనాలకు మించి వరిసాగు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు నెలతో ఖరీఫ్‌పంటల సాగుకు అదను ముగిసిపోయింది. సీజన్‌కు సబంధించి రా ష్ట్రంలో పంటసాగు సరళిని పరిశీలిస్తే వరి సాగు విస్తీర్ణం అంచానాలకు మించి భారీగా సాగులోకి వచ్చింది. గత జులైలో కురిసిన భారీ వర్షాల వ ల్ల రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయం గా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చుకు వెనుదీయకుండా వ్యవసాయరంగానికి ఉచిత వి ద్యుత్‌ను అందజేస్తుండటం, ప్రభుత్వం సకాలం లో పంటలసాగు పెట్టుబడి కోసం రైతుబంధు ని ధులు అందజేసి సహకరించటంతో ఈసారి రైతు లు ఉత్సాహంగా వరిసాగు పట్ల మొగ్గు చూపా రు. గోదావరి నదీ పరివాహకంగా అన్ని ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఆయకట్టుకు సా గు నీటి విడుదల కూడా సకాలంలో జరిగిపోయింది. ఎటొచ్చి కృష్ణానది పరివాహకంగానే ప్ర తికూల పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటినిలువలు అ డుగుంటుతున్నాయి. సాగర్ కింద ఎడమ కాలు వ ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారింది.

ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు వరినాట్ల పట్ల మొగ్గు చూపారు. బుధవారం నాటికి రాష్ట్రంలో 55.90లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు సాధారణ విస్తీర్ణం 49.86లక్షల ఎకరాలుగా వ్యవసాయశాఖ ప్రాధమిక అం చనా వేసింది. అయితే అంచనాలకు మించి సుమారు 5లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. ఇంకా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరినాట్లు వేస్తూనే ఉన్నారు. మరో వారం పదిరోజుల్లో గాని వరినాట్ల పనులు ముగింపు దశకు రావని, మరో ఐదారు లక్షల ఎకరాల మేరకు వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నా రు. ఇక ఇతర పంటల సాగు అదను పూర్తిగా ముగిసిపోయింది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌కింద 1.24కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయించాలన్నది వ్యవసాయ శాఖ ప్రణాళిక కాగా , సమయానికి 1.12కోట్ల ఎకరాల్లో పంటలు సాగులోకి రావాల్సివుంది. గత ఏడాది కూడా ఈ సమయానికి 1.21కోట్ల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇప్పటివరకూ 1,16,34,925 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణంలో 93.61శాతం పంటలు సాగులోకి వచ్చాయి. అందులో వరి సాగు సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా సాగు చేశారు. 112.12శాతం వరిసాగు జరిగింది. ఆహార పంటలకు సంబంధించి వరి తర్వాత స్థానంలో 6.06లక్షల ఎకరాల్లో మొక్కజోన్న సాగు చేశారు. 26800ఎకరాల్లో జొన్న సాగు జరిగింది.

భారీగా తగ్గిన పప్పుధాన్య పంటల సాగు:
పప్పుధాన్య పంటల విస్తీర్ణం ఈ సారి భారీగా తగ్గిపోయింది. 9.43లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో పప్పుధాన్య పంటలసాగును అంచనా వేయగా , 5.32లక్షల ఎకరాలకు మించి సాగు జరగలేదు. సాధారణ విస్తీర్ణంలో 56.39శాతం వద్దనే పప్పుధాన్యాల సాగు ఆగిపోయింది. అందులోకూడా కంది 4.58లక్షల ఎకరాలు, మినుము 19427 ఎకరాలు, పెసర 53474 ఎకరాలు సాగు చేశారు. నూనెగింజ పంటల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.19లక్షల ఎకరాల విస్తీర్ణంలో నూనెగింజ పంటల సాగు లక్షంగా పెట్టుకోగా ఇందులో ఇప్పటివరకూ 87.85 శాతం సాగులోకి వచ్చాయి. వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ తదితర నూనెగింజపంటలు 4,56,411 ఎకరాల్లో సాగు చేశారు. ప్రధాన వాణిజ్య పంటలకు సబంధించి 44.70లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయగా ,33172 ఎకరాల్లో చెరకు సాగు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News