Wednesday, January 22, 2025

‘వరి’త తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ /న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం వరిపంట దిగుబడిలో కొంగు బంగారమై, దేశానికే కాకుండా ప్రపంచానికే ఈ దక్షిణాసియా తరగని గనిగా అవతరించింది. ముఖ్యమం త్రి కెసిఆర్ దూరదృష్టి, దక్షత, భగీరథ తపనల ఫ లితంగా ముందుగా హరిత, జల సమృద్ధిల తెలంగాణ అయిన రాష్ట్రం ఇప్పుడు రికార్డు స్థాయి అం దులోనూ ప్రపంచ స్థాయి రికార్డు భరిత ఘనతతో వరిత తెలంగాణం అవుతోంది. తెలంగాణలో ఈ ఒక్క యాసంగి పంటకాలంలోనే 56 లక్షల ఎకరాలలో 1.30 కోట్ల టన్ను ల వరి ధాన్యం దిగుబడి అయింది. ప్ర పంచవ్యాప్తంగా పలు కారణాలు ప్రత్యేకించి వాతావరణ పరిస్థితులుప్రతికూలతలతో వరి గు విస్తీర్ణం తగ్గడం, ఇదే విధంగా పంట దిగుబడి గణనీయంగా పడిపోవడం వంటి పరిణామాల నే పథ్యంలో తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా వరి పంట దిగుబడి పెరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసిఆర్ తనకున్న వ్యవసాయ దార్శనికత, తీసుకోవల్సిన జాగ్రత్త చర్యల అమలుతీరుతెన్నులతో పంట దిగుబడి పెరిగి ఇప్పుడు దేశానికే వరి పంట విషయంలో తెలంగాణ ధాన్యాగారం అ యింది. ‘ పుట్టెడు వడ్ల గుమ్మి దనం ’ సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న 87 లక్షల టన్నుల బియ్యం కొరత ప్రత్యేకించి దక్షిణాసియా దేశాలలో రాబోయే రోజులలో బియ్యం క టకటకు దారితీస్తుందని ఉత్పత్తుల సం బంధిత లెక్కలతో ఫిచ్ నివేదిక వెలువడింది. ఇం దులో గత రెండు దశాబ్దాలలో ఎప్పుడూ లేని వి ధంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతకు ముందెన్నడూ లేనిస్థాయిలో బియ్యం కొరత ఏర్పడుతుందని తే లింది. ఓవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరో వైపు పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం దశలో బియ్యం కటకట ప్రపంచ స్థాయి సమస్యగా మారుతోంది. ఈ దశలోనే కెసిఆర్ చొరవతో పంటపై దృష్టి చడంతో ఇప్పుడు తెలంగాణ వరి సిరి అవుతోంది. వరి పంట విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభు త్వం పలువిధాలుగా మోకాలడ్డినా లెక్కచేయకుం డా ఈ జనం నిత్య ఆహారం పంటపై దృష్టిసారించిన క్రమం ఇప్పుడు గణనీయ విజయానికి దారితీసిందని అంతర్జాతీయ పత్రికలే పేర్కొంటున్నాయి.
మలేసియా, పిలిప్పిన్స్ ఇతర దేశాలకు బియ్యం కటకట
దిగుబడి తగ్గడంతో తీవ్ర బియ్యం సంక్షోభం ఏర్పడి సరఫరాల లోట్లుతో దిగుమతి చేసుకునే పలు దేశాలలో బియ్యానికి మరింత కటకట పడాల్సి ఉంటుంది. ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, మలేసియా, పలు ఆఫ్రికా దేశాలలో ఈ పరిస్థితి పలు విధాలుగా ఇతరత్రా పరిణామాలకు దారితీసే ముప్పుంది. గ్రో ఇంటలిజెన్స్ సీనియర్ పరిశోధకురాలు కెల్లీ గౌగ్రీ తెలియచేసిన వివరాల మేరకు పలు దేశాలు ఇకపై తమ నిల్వలను తగ్గించుకుంటాయి.

దిగుమతి సరుకు భారం భరించే స్థితిలో పలు దేశాల ఆర్థిక పుష్టి లేదు. పాకిస్థాన్, టర్కీ , సిరియా వంటి దేశాలు ఇప్పటికే ఆహార సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రపంచ స్థాయిలోని బియ్యం ఎగముతి మార్కెట్ ఇప్పుడు అతలాకుతలం అయింది. ఇతర దినుసులతో పోలిస్తే ఈ మార్కెట్ విస్తృతపరిధిలో ఉంటుంది. అయితే భారతదేశం బియ్యం ఎగుమతులపై విధించిన నియంత్రణలు ఆంక్షలతో పరిస్థితి దిగజారిందని ఫిచ్ సొల్యూషన్స్ తెలిపింది. గత ఎడాది సెప్టెంబర్‌లో భారతదేశం మరపట్టిన బియ్యం ఎగుమతిని నిలిపివేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలపై పెను ప్రభావానికి దారితీసిందని సంస్థ తరఫున హర్ట్ తెలిపారు. ప్రపంచస్థాయి బియ్యం మార్కెట్ వచ్చే ఏడాది తిరిగి మామూలు స్థితికి వస్తుందని అంచనావేస్తున్నారు. అయితే వరి పంట దిగుబడి తగ్గుతున్న క్రమంలో బియ్యం ధరలు ఇప్పట్లో కరోనా లాక్‌డౌన్ల ముందటి స్థాయికి చేరడం ఇప్పట్లో సాధ్యంకానిదే అవుతుందని మార్కెటిర్లు చెపుతున్నారు.

ఇక ఈసారి భారతదేశంలో సాధారణ , లేదా అంతకు తక్కువ వర్షపాతాలే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేయడం, రుతుపవనాలు పెద్దగా సహకరించబోవనే విశ్లేషణలకు దిగడంతో ఇప్పటికే తీవ్రస్థాయి ఎండలు ఉండటంతో బియ్యం , గోధుమ పంట దిగుబడి మరింత పడిపోతుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఉత్తరాదిలో ప్రధాన ఆహరం అయిన గోధుమ పంట పరిస్థితి గురించి ఇప్పటివరకూ కూడా కేంద్రం కించిత్తు స్పందన కనబర్చలేదు . ఈ విషయాన్ని పలు ఉత్తరాది రాష్ట్రాలు తరచూ తెలియచేస్తున్నాయి. అయితే వాతావరణ ప్రతికూలత కేవలం భారతదేశానికే కాకుండా చైనా, ఇతర దేశాలకు కూడా ఉంటుందని వెల్లడయింది. ప్రపంచంలో అతి పెద్ద బియ్యం, గోధుమల ఉత్పత్తి దేశం అయిన చైనా ఇప్పుడు రెండు దశాబ్దాలలో ఎప్పుడూ లేని స్థాయిలో కరువు పరిస్థితిని ఎదుర్కొంటోందని విశ్లేషకులు తెలిపారు. పలు యూరప్ దేశాల్లోనూ మొన్నటివరకూ కరోనా వైరస్ ఇప్పుడు కరువు కాటకాల పరిస్థితి ఉంది.
వరి చాలా నాజూకు పంట
ప్రపంచంలో ప్రధాన ఆహారం అయిన బియ్యం పంట వరి చీటికి మాటికి ఆటుపోట్లకు తట్టుకోలేని పంటగా ఉంది. ఎల్‌నినో ప్రభావాలతో ఈ వరి పంట దిగుబడి తగ్గుతుంది. నాణ్యత దెబ్బతింటుంది. పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచస్థాయి పరిణామాలు ప్రత్యేకించి పది సంవత్సరాల నుంచి వరి దిగుబడి క్రమంలో తలెత్తుత్తున్న అంతర్జాయ పరిణామాలు , ఈ దినుసు పట్ల ఉండే ప్రపంచ స్థాయి గిరాకీని పరిగణనలోకి తీసుకుని ఈ పంటను గణనీయ స్థాయిలో పండించే స్థాయిలో శాస్త్రీయతను, సాంకేతికతను, వ్యవసాయ నిపుణుల ద్వారా సరైన సలహాలను సంప్రదింపులను పరిగణనలోకి తీసుకుని ఈ సీజన్‌లో పంటను రికార్డు స్థాయికి చేరుస్తున్నందున ప్రపంచస్థాయిలో వరి పంట దిగుబడిలో తెలంగాణ రికార్డు ఇప్పుడు ఇంటింటి వంటింటి అంశం అయింది.

నోటికి కూటికి మధ్య సరైన సంధానం జరిగే ప్రక్రియ మరింత పదిలం అయ్యేలా చేసేందుకు కలిసివచ్చిన జలవనరులను సద్వినియోగం చేసుకోవడం, సరఫరాల లేమిలేని విద్యుచ్ఛక్తి మరింతగా ఉపకరించాయి. వరి కంకి ఎగురేసిన తెలంగాణ జెండా పచ్చగా రెపరెపలాడేందుకు కెసిఆర్ ప్రదర్శించిన పొలం పనితీరు పనికివచ్చిందని దేశవ్యాప్త విశేషవిశ్లేషణలు వెలువడుతున్నాయి. చైనా నుంచి అమెరికా వరకూ అక్కడి నుంచి ఇయూ దేశాల వరకూ ఇప్పుడు బియ్యానికి కటకట ఉంది. ధరలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆసియా పసిఫిక్ దేశాలతో కలిపితే మొత్తం మీద 5.6 బిలియన్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆహారంగా జీవించే క్రమం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆహారం అయిన దేశాలలో 90 శాతం ఆసియా పసిఫిక్ దేశాల ప్రజలు బియ్యంతోనే ఆహారం సమకూర్చుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News