రికార్డు స్థాయిలో వరిసాగు.. 66లక్షల ఎకరాల్లో యాసంగి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీ ర్ణం 66.18లక్షల ఎకరాలకు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో యాసంగి పంటలు సాగు కావటం ఇదే ప్రధమం అని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా దేశం లో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ రాష్ట్రం యాసంగి వరిసాగులో కొత్త రికార్డు నెలకొల్పింది. వరి సాధారణం కంటే 132శాతం అధికంగా వరినాట్లు వేశారు. వానకాలం పంట విస్తీర్ణంతో పోటీ పడ్డట్టు రైతులు యాసంగిలో కూడా అత్యధిక సంఖ్యలో వరిసాగు పట్ల మొగ్గు చూపారు. ఈ సీజన్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 22.19లక్షల ఎకరాలు కాగా, బుధవారం నాటికి మొత్తం 51.62లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగులోకి వచ్చినట్టు వ్యవసాయ శాఖ వారంతపు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది యాసంగిలో రాష్ట్రమంతటా 36.43లక్షల ఎకరా ల్లో పంటలు వేయగా ఈసారి దాదాపు అంతకు రెట్టింపు విస్తీర్ణంలో పంట లు సాగులోకి వచ్చాయి. వరిసాగు కూడా గత యాసంగిలో 29.33లక్ష ల ఎకరాల వద్దనే ఆగిపోయింది. ఈ సారి సాధారణ విస్తీర్ణానికి మించి 132శాతం విస్తీర్ణంలో వరి పంట సాగులోకి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం చరిత్రలో ఆల్‌టైం రికార్డును సృష్టించింది. వరి, గోధుమ, జొన్న, తదితర అన్ని రకాల ఆహారదాన్య పంటలు 105శాతం సాగులో కి వచ్చాయి. పప్పుధాన్య పంటలు 48శాతం సాగు చేశారు.
అనుకూలించిన వాతావరణం
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం యాసంగి పంటల సాగుకు పూర్తిగా అనుకూలించింది. సమృద్ధిగా వర్షాలు కురువటం, భూగర్జ జలాలు కూడా పెరగటంతో సాగునీటి పారుదల వసతులు బాగా మెరుగుపడ్డా యి. గత జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ వర్షపాతాన్ని పరిశీలిస్తే 1261మిమి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 27జిల్లాల్లో 20 శాతం పైగా అధిక వర్షపాతం నమోదుకాగా, అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామబాద్, జగిత్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
Paddy cultivation record level 66 lakh Acres in Telangana