Sunday, January 19, 2025

ధాన్యం..దైన్యం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలతో వ్యవసాయ రంగం అతలాకుతలమవుతోంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధ్యానం రాశులు అన్నదాతను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే కన్నీటి పర్యంతమవుతున్నారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోతున్న నేపథ్యంలో సరియైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తు వచ్చిన వర్షానికి సుమారు లక్ష టన్నుల మేరకు ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు చోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందింస్తోంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు చేరేలా చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచనలు చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపైన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన గన్నీ సంచులకోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు.

ఇంతలోనే గురువారం కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసి పోయింది. సుమారు రెండు వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ధరూర్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దగా మారింది. నాగారం కొనుగోలు కేంద్రం వద్ద తూకం కోసం తీసుకొచ్చిన ధాన్యం, బస్తాల్లో నింపిన ధాన్యం వర్షానికి తడిసి పోయింది. యాలాల మండలంలో బెన్నూర్, జక్కేపల్లి, అక్కంపల్లి, జుంటిపల్లి ,తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి. రైతులు టార్పాలిన్లు కప్పినప్పటికీ వర్షపు నీరు బస్తాల కిందికి చేరింది.పెద్దపల్లి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే రెండు మూడు సార్లు తడిసి పోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్
జిల్లాలో అకాల వర్షానికి ధాన్యం రైతులకు బారీగా నష్టం వాటిల్లింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు ధాన్యపు సంచులను తడిపేసింది. టెక్మాల్ లోని ఐకెపి, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, ధనూర తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. నర్సాపూర్ లోని మార్కెట్ యార్డు ఆవరణంలో ఉన్న కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయింది. తూఫ్రాన్‌తోపాటు మండలోని పలు గ్రామాల్లో రొడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. అంబాజిపేట కొనుగోలుకేంద్రంలో ఉన్న ధాన్యం సంచులు వర్షపు నీటిలో తేలియాడాయి. అల్లాదుర్గం, గుడిపెద్దాపూర్ ,కాయిదంపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. గత వారం రోజులుగా రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో అకాల వర్షాలకు ధాన్యం రైతులు భారీగా నష్టపోతున్నారు.

అధికారులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొన్ని జిల్లాలకు చెందిన అధికారుల్లో చలనం కనిపించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వర్షసూచనలకు తగ్గట్టుగా రైతుల్లో అవగాహన కల్పిచంటంలో సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. తడిసిపోయిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎంత మాత్రం అధైర్యపడవద్దని ప్రభుత్వం చెబుతోంది. మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలతో వ్యవసాయ రంగం అతలాకుతలమవుతోంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధ్యానం రాశులు అన్నదాతను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే కన్నీటి పర్యంతమవుతున్నారు. పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోతున్న నేపథ్యంలో సరియైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తు వచ్చిన వర్షానికి సుమారు లక్ష టన్నుల మేరకు ధాన్యం తడిసిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

పలు చోట్ల తడిసిన ధాన్యం మొలకెత్తుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందింస్తోంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు చేరేలా చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచనలు చేశారు. ఈ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపైన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన గన్నీ సంచులకోసం వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే గురువారం కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసి పోయింది. సుమారు రెండు వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ధరూర్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దగా మారింది. నాగారం కొనుగోలు కేంద్రం వద్ద తూకం కోసం తీసుకొచ్చిన ధాన్యం, బస్తాల్లో నింపిన ధాన్యం వర్షానికి తడిసి పోయింది. యాలాల మండలంలో బెన్నూర్, జక్కేపల్లి, అక్కంపల్లి, జుంటిపల్లి ,తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి. రైతులు టార్పాలిన్లు కప్పినప్పటికీ వర్షపు నీరు బస్తాల కిందికి చేరింది.పెద్దపల్లి జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే రెండు మూడు సార్లు తడిసి పోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో అకాల వర్షానికి ధాన్యం రైతులకు బారీగా నష్టం వాటిల్లింది. పాపన్నపేట కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు ధాన్యపు సంచులను తడిపేసింది. టెక్మాల్ లోని ఐకెపి, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, ధనూర తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. నర్సాపూర్ లోని మార్కెట్ యార్డు ఆవరణంలో ఉన్న కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయింది. తూఫ్రాన్‌తోపాటు మండలోని పలు గ్రామాల్లో రొడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. అంబాజిపేట కొనుగోలుకేంద్రంలో ఉన్న ధాన్యం సంచులు వర్షపు నీటిలో తేలియాడాయి. అల్లాదుర్గం, గుడిపెద్దాపూర్ ,కాయిదంపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. గత వారం రోజులుగా రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో అకాల వర్షాలకు ధాన్యం రైతులు భారీగా నష్టపోతున్నారు.అధికారులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కొన్ని జిల్లాలకు చెందిన అధికారుల్లో చలనం కనిపించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వర్షసూచనలకు తగ్గట్టుగా రైతుల్లో అవగాహన కల్పిచంటంలో సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. తడిసిపోయిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎంత మాత్రం అధైర్యపడవద్దని ప్రభుత్వం చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News