Monday, December 23, 2024

విద్యుదాఘాతంతో వరి గడ్డి దగ్ధం

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ: మండల కేంద్రం చండ్రుగొండలోని శ్రీనగర్‌కాలనీలో సీసీ రోడ్డుపై వరిగడ్డి లోడ్‌తో వెళ్తున ట్రాక్టర్ విద్యుదాఘాతానికి గురై వరి గడ్డి ఆగ్నికి ఆహుతైంది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాద సంఘటన వివరాలిలా ఉన్నాయి. తిప్పనపల్లి గ్రామానికి చెందిన రైతు పోతురాజు ఆదినారయణ చండ్రుగొండ నుండి వరిగడ్డిని ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనగర్‌కాలనీలో గడ్డిలోడుకు సర్వీసు వైరు తగలడంతో మంటలు చేలరేగాయి. ఒక్కసారిగా మంటఅలు వ్యాపించడంతో వరి గడ్డి పూర్తిగా దగ్ధమైంది. రూ. వేలు విలువ చేసే గడ్డితోపాటు ట్రాక్టర్ ట్రాలి పాక్షికంగా నష్టం వాటిల్లింది. స్థానికులు మంటలు అర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News