Monday, December 23, 2024

వరి రైతు గుండె’కోత’

- Advertisement -
- Advertisement -

Paddy in 35.84 lakh acres in Yasangi

యాసంగిలో 35.84లక్షల ఎకరాల్లో నాట్లు
65లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఏప్రిల్ తొలివారం నుంచి కోతలు ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది రోజుల్లో వరికోతలు ప్రారంబం కానున్నాయి. ఈ యాసంగిలో 65లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి లభించే అవకాశాలు ఉన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన యాసంగిధాన్యం సేకరించబోమని తెలిపినందున యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ ప్రారంభానికి ముందుగానే ప్రకటించింది. విత్తన కంపెనీలతో అగ్రిమెంట్లు ఉన్న రైతులు, మిల్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న రైతులు వరిసాగు చేసుకోవచ్చని, అంతే కాకుండా సొంతంగా ధాన్యం అమ్మకోగలమన్న ధైర్యం ఉన్న రైతులు కూడా యాసంగిలో వరిసాగు చేసుకోవచ్చిని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం పిలుపునకు రైతుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు రైతులు మొండిధైర్యంతో వరిసాగు చేశారు. ఇప్పడు తీరా వరికోతలు ప్రారంభమవుతున్న సమయం సమీపిస్తుండటంతో వారిలో ధాన్యం విక్రయాలపై ఆందోళన ప్రారంభమైంది.

ఇప్పటికిప్పుడు సాధ్యమేనా?

రైతులనుంచి ధాన్యం కొనుగోళ్లు చేయాలంటే నెల రోజుల మందునుంచే ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది. గన్ని సంచుల లభ్యత, టార్ఫాలిన్ల లభ్యత, హామాలీల సన్నద్దత, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎంపిక , వేయింగ్ మిషన్లు, ధాన్యం రవాణా సదుపాయాలు వంటి వాటికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవాల్సివుంటుంది. అన్నింటికీ మించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాకు నగదు చెల్లించేందుకు అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యాసంగిలో 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తని అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు .అందులో రాష్ట్ర అవసరాలు, మిల్లర్ల ద్వారా కొనుగోళ్లు, విత్తన కంపెనీల అవసరాలు పోగా 45లక్షల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాల్సివస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే రా్రష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకూ ఈ దిశగా ఎటువంట కసరత్తులు జరగలేదు. రైతుల ఆందోళనను గుర్తించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ఎలాగైనా రైతులను కాపాడుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. సోమవారం జరిగే కీలక సమావేశంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News