Tuesday, November 5, 2024

తెలంగాణలో 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

Anil Kumar

హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు పెద్దయెత్తున జరుగుతున్నాయని తెలంగాణ పౌరసరఫరాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది యాసంగి సీజన్ లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 25 జిల్లాల్లో 4387 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని పౌర సరఫరాల కమిషనర్  అనీల్ కుమార్ తెలిపారు.శుక్రవారం నాటికి 75,495 మంది రైతులనుంచి రూ.1088 కోట్ల విలువ చేసే 5.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇందులో 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగింది. కొనుగోళ్లకు ప్రస్తుతం 7.96 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News