మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు బియ్యం దొంగలకు చెక్ పెట్టింది. పౌరసరఫరాల శాఖ ద్వారా మిల్లర్లకు సిఎంఆర్ కింద సరఫరా చేస్తున ధాన్యం ,సిఎంఆర్ కింద తిరిగి బియ్యం అప్పగింత విషయంలో మరింత కఠిన వైఖరిని పాటించాలని నిర్ణయించింది.అందుకు తగ్గట్టుగానే పాత జీ వోల బూజు దులిపేసింది. ‘మనతెలంగాణ’ దినపత్రికలో గత నా లుగు రోజులగా వస్తున్న వరుస కథనాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఏటా సిఎంఆర్ కింద ధాన్యం తీసుకుని తిరిగి బియ్యం అప్పగించకుండా టన్నుల కొలది బియ్యాన్ని దిగమింగుతూ వేల రూపాయలు వెనకేసుకుంటున్న మిల్లర్ల అంతు చూ సేవిధంగా సిఎంఆర్‌లో సవరణలు చేసింది. ఇందుకు సంబంధించి శనివారం పౌరసరఫరాల శాఖ సవరణలతో కూడిన జీ వోను జారీ చేసింది.
సిఎంఆర్ విధానంలో 201516 నుంచి 202324 వరకూ జారీ చేసిన తొమ్మిది జీవోలను సవరిస్తూ కొత్త జిఒను విడుదల చేసింది. సిఎంఆర్ కింద ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోతే అటువంటి మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టంతోపాటు క్రిమినల్‌కేసులు కూడా పెడుతూ వచ్చింది. అయితే ఇప్పటి వరకూ రెవెన్యూ రికవరీ చట్టంలో మూవబుల్ ప్రాపర్టీల కింద మిల్లుల్లో ఉన్న బియ్యం , ఇతర వాహనాలు , ఫర్నిచర్ తదితర వాటిని మాత్రమే ప్రభుత్వం జప్తు చేసేది. తాజాగా సిఎంఆర్ విధానంలో చేసిన సవరణల మేరకు మూవబుల్ ప్రాపర్టీలతోపాటు స్థిరాస్తులను కూడా జప్తు చేయనుంది. బియ్యం ,వాహనాలు ,ఇతర చరాస్థులతోపాటుగా మిల్లును మిల్లుతోపాటు స్థలాలు, పొలాలు ఇళ్లను కూడా జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి సంక్రమించేలా జీవోలో సవరణులు చేసింది. తాజా జీవో వల్ల అక్రమాలకు పాల్పడే మిల్లర్లు ఇక తప్పించుకోలేరని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి.