ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యం రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్.కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్‌గా సుహాన హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి, ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అయ్యే అనేక అంశాలతో దర్శకుడు ఎన్.కె ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ.. డైరెక్టర్ ఎన్.కె సినిమాను బాగా డీల్ చేశారు. నిర్మాత త్రినాధ్ సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీశారు. సుహాన తెలుగు రానప్పటికీ బాగా నటించింది.
పాడేరు 12వ మైలు సినిమాలో నేను, శ్రవణ్, ప్రభాకర్ గుర్తిండిపోయే రోల్స్ చేశాం’ అని అన్నారు. డైరెక్టర్ ఎన్.కె మాట్లాడుతూ…‘నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా నేను డైరెక్టర్‌గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను. సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు’ అని తెలిపారు. నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ.. ‘పాడేరు 12వ మైలు సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్, యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది’ అని తెలియజేశారు. హైదరాబాద్, వైజాగ్, పాడేరులో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్‌లోకి రానుంది.