Thursday, April 3, 2025

అభ్యర్థుల వింత ప్రచారం…. ఒడిబియ్యంగా ఓట్లు ఇమ్మని ఒకరు… పాడెక్కుతామని ఇంకొకరు!

- Advertisement -
- Advertisement -

ఒడిబియ్యంగా ఓట్లు ఇమ్మని ఒకరు… పాడెక్కుతామని ఇంకొకరు!

ప్రచారం చివరి అంకానికి చేరడంతో అభ్యర్థుల ప్రచార శైలి కూడా మారింది. కొందరు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నారు. ఇంకొందరు ఓటెయ్యకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు.

జగిత్యాల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోగ శ్రావణి శ్రమకోర్చి ప్రచారం చేశారు. బీజేపీకి చెందిన కొందరు బడా నాయకులు కూడా జగిత్యాల వచ్చి ఆమె తరపున ప్రచారం చేశారు. ప్రచారం చివరి దశకు వచ్చేసరికి, ఆమె సెంటిమెంటుకు తెరలేపారు. ‘ఓట్లను ఒడిబియ్యంగా అందించి… మీ ఆడబిడ్డను గెలిపించి, సంతోషంగా పంపించండి. ఒకవేళ మీ ఆడబిడ్డకు ఏదైనా అయితే బ్రతికే పరిస్థితి ఉండదు. ఒడిచాచి ఒడిబియ్యంగా ఓట్లను ఇమ్మని ప్రాధేయపడుతున్నా. ఆశీర్వదించండి’ అంటూ అడగటం ఆశ్చర్యపరచింది.

ఇక హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మరో అడుగు ముందుకేసి, తనను గెలిపించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించారు. ‘ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్రకు వస్తా. లేకపోతే 4వ తేదీన నా శవయాత్రకు రండి’ అంటూ ఓటర్లను బెంబేలెత్తించారు. ‘మీ కాళ్లు పట్టుకుంటా ఒక్కసారి అవకాశం ఇవ్వండి’ అంటూ వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News