Thursday, December 26, 2024

యువతకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బిఆర్‌ఎస్‌దే…

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం యువతకు 232,308 ఉద్యోగాల నోటిఫికే షన్ ఇచ్చి 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో ఏ ర్పాటుచే సి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఆశలు చూ పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం దానిపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మొదటి అసెంబ్లీ సమావేశం లోనే డీఎ స్సీ నోటిఫికేషన్ వేస్తామని కనీసం దాని ఊసు కూడా ఎత్తలేదు అన్నారు. కనీసం వారిచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ ల్ గా రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలని కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభు త్వంలో యువకులకు ఉద్యోగాలే ఇవ్వలేదని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, సీఎం ఇప్పుడు నాలుగో తేదీన 1,60,0 83 మం దికి జీతాలు ఎలా వేశారు చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించిన కోదండ రాం కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై యువతకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమాఖ్యాంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 24 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని అందులో తెలంగాణకు రావలసిన వాటా ప్రకారం 10000 మాత్రమే ఉద్యోగాలు కల్పించారని ఆయన అన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన కేసీఆర్ మాత్రం 2014 నుంచి 2023 వరకు 2 లక్షల 32 వేలకు పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, 160 0 83 ఉద్యోగాలు యువకులకు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపారన్నారు.

ఇంకా 42,652 ఉద్యోగాలకు ఇప్పటికే రాత పరీక్ష రాసి కూడా ఉన్నారని అతి త్వరలో అవి కూడా పూర్తవు తాయని అన్నారు. వీటన్నిటితో కలుపుకొని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 2,20700కు పైగా ఉద్యోగాలు కల్పించారని గుర్తుచేశారు. ఏ ఉద్యోగాల్లో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని దానిపై కూడా క్లారిటీ ఇచ్చామన్నారు. అగ్రికల్చర్ కో-ఆపరేషన్లో 5303, ఎనిమల్ హస్బెండ్ డైరీలో 1135, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ లో 2552, ఎనర్జీ డిపార్ట్మెంట్లో 52,324, ఎ న్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2152, ఫైనాన్స్లో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో 219, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో 8132, హోమ్ లో 46850, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ లో 20, డెవలప్మెంట్లో 895, లేబరైన్ ఎంప్లాయి మెంట్ లో 55, లా డిపార్ట్మెంట్లో 12, మైనారిటీస్ వెల్ఫేర్ లో 3745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 1957, పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 10763, ప్లానింగ్ సర్వీస్ లో 474, రెవెన్యూ 3543, షెడ్యూల్ క్యాస్ట్ 3770, సెకండరీ ఎడ్యుకేషన్ 9143, ట్రైబల్ వెల్ఫేర్ 15 37, ఉమెన్ చిల్డ్రన్ 147, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ 352,50 స్టేట్ లెవెల్ పోలీస్ 47068, రెసిడెన్షియల్లో 3694, మెడికల్ 2047, డిపార్ట్మెంట్ సెలక్షన్ 22,892, ట్రాన్స్కోలు 5264, ఇవే కాక వివిధ విభాగాల్లో 492 తో కలుపుకొని మొత్తం 163083 ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీది అన్నారు.

ఇవేకాక ఐటీ డిపార్ట్మెంట్లో సుమారు పది లక్షల పైగా ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. 60 సంవ త్సరాల కాంగ్రెస్ పాలనలో ఐటీలో కేవలం 3,23,396 మాత్రమే ప్రైవేట్ లో ఉద్యోగాలు కల్పిస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి మినిస్టర్ కేటిఆర్ 10 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించి ఐటి రంగాన్ని 57 వేల కోట్ల నుంచి రెండు లక్షల 41 వేల కోట్లకు ఎదిగేలా చేశారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇండస్ట్రీలకు కూడా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా విద్యుత్ అందించి వారికి సహకరించిన ఘనత కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వందే అన్నారు. ఒక్క పవర్ హాలిడే లేకుండా ఇండస్ట్రీలని అన్ని విధాల ఆదుకున్నామన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో కాలయాపన చేయకుండా కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన రెండు లక్షల 32 308 ఉద్యోగాలు కాకుండా మరో రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఈ సంవత్సరం లోపే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News