Wednesday, January 22, 2025

హుజురాబాద్ లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

దళితబంధు కోసం..హుజురాబాద్ దద్దరిల్లింది. వి వరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకర్గంలోని దళిత కుటుంబాలకు రెండో విడత దళితబంధు వెంటనే విడుదల చేయాలంటూ, అర్హులైన దళిత కుంటుబా లు శనివారం హుజురాబాద్‌లోని ఎంఎల్‌ఎ ఇంటి వద్ద ఏ ర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమా నికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు పె ట్టకముందే కొంతమంది దళితులు కౌశిక్ రెడ్డిని ‘మీరు మా వెంట అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ధర్నా చేసి దరఖాస్తు స్వీకరణ చేస్తే బాగుంటుంది’ అని కోరారు. దళితులను ఉద్దేశించి కౌ శిక్ రెడ్డి ప్రసంగం ప్రారంభించడంతో ‘దళితబంధు కోసం మా వెంట ఉంటారా ..మాకోసం పోరాడుతారా.. లేదా అంటూ దళితులంతా ముక్తకంఠంతో కోరగా వెంటనే స్పం దించిన ఎంఎల్‌ఎ ప్రాణమైన ఇస్తా మీకోసం’ అని చెప్పా రు.అనుకున్నదే తడవుగా దళితులందరితో కలిసి ధర్నా కో సం చౌరస్తా వైపు కదిలారు. ఇంట్లోంచి బయటకు వస్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు నిలువరించాలని చూసినా

ఎంత కూ వినకుండా వేల మందిని వెంట వేసుకొని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి న అనంతరం డప్పు కొడుతూ ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత వారించినా దళితులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగి తమకు రెండ విడత దళితబంధు వెంటనే అందించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ధర్నాకు దిగిన కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా కౌశిక్ రెడ్డి వినకుండా ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసు లు ఎన్ని ప్రయత్నాలు చేసినా దళితులంతా అడ్డుగా నిలుచున్నారు. కొంతమంది పోలీసులు తీసుకువచ్చిన వాహనాలకు అడ్డం పడుకొని నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కౌశిక్ రెడ్డిని నాటకీ అప్పటి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. అనంతరం కోపంతో రగిలిపోయిన దళితులంతా కలిసి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలో బైఠాయించారు. కౌశిక్ రెడ్డి వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.

మా కోసం కొట్లాడే నాయకున్ని ఎలా అరెస్టు చేస్తారు?
దళితులంతా కలిసి తమ కోసం కొట్లాడే నాయకున్ని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు రెండు గంటల పాటు పోలీసులు ఎంత నెట్టేసినా తిరిగి ధర్నాకు దిగారు. ఒకవైపు పోలీసులు ధర్నా విరమింపజేస్తుంటే మరోవైపు మరికొంతమంది వచ్చి ధర్నాకు కూర్చున్నారు. ధర్నాకు దిగిన దళితులు ఎంతకూ వినకపోవడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్‌జితో పాటు హుజురాబాద్, జమ్మికుంట సిఐలు తిరుమల్ గౌడ్, వరగంటి రవి ధర్నాను విరమింపజేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి అస్వస్థత..
దళితబంధు రెండో విడత విడుదల చేయాలంటూ ధర్నాకు దిగిన ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. అనంతరం మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెంటనే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ అపోలో ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. కౌశిక్ రెడ్డి వెంట భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, తరలివెళ్లారు. తమ నేతకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.

ప్రాణం పోయినా దళితులకు అండగా ఉంటా..
దళితబంధు రెండో విడత విడుదల సందర్భంగా అస్వస్థతకు గురైన అనంతరం ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎన్ని కేసులు పెట్టినా.. చివరకు తన ప్రాణం పోయినా దళితులకు అండగా ఉంటానని అన్నారు. దళితబంధు రెండో విడత విడుదల చేసే వరకు ఊరుకునేది లేదని అన్నారు.
రేవంత్ కనుసన్నల్లో పోలీస్: మాజీ ఎంపి వినోద్ కుమార్
పదవులు శాశ్వతం కాదు..పోలీసులు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళితబంధు కోసం దళితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ యంత్రాంగం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తోందని, పోలీసులు అనవసరంగా దాడి చేస్తే చర్యలు తప్పవు..దళితులపై లాఠీఛార్జి చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం
దళితబంధు రెండో విడుత కోసం ధర్నాకు దిగిన హుజురాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయటం చేతగాని దద్దమ్మ రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు. అడిగిన వారిపై దాడులు చేయడం దారుణం అన్నారు.
కౌశిక్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్..
హుజురాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి దళితుల కోసం రెండవిడత దళిత బంధు విడుదల చేయాలని వారి కోరిక మేరకు ధర్నాలో పాల్గొంటే పోలీసులు దాడి చేయడం దారుణం అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి అస్వస్థతకు గురికాడంతో ఆయన ఆరా తీశారు. స్వయంగా కౌశిక్ రెడ్డికి ఫోన్ చేసి ఆరోగ్యం విషయమై ఆడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందవద్దని, పార్టీ అండగా ఉంటుం దనిభరోసా ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోనే రేవంత్ సర్కార్ పాలనను ఎండగడతామని అన్నారు. కౌశిక్ రెడ్డికి జరిగిన దానిపై న్యాయపరంగా ముందుకు వె ళ్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News