Monday, January 20, 2025

పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వెంటనే ముదిరాజ్‌లకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి సమావేశంలో ప్రస్తావనలో జరిగిన దృశ్యాన్ని ఒక మహిళ అడిగిన ప్రశ్న ప్రభుత్వ పథకాలు మాకు ఇప్పటి వరకు అందలేదని ఆమె అడుగుతుండగా ఆ విషయాన్ని టీవీ వీడియో జర్నలిస్టు బండి అజయ్ ముదిరాజ్ కెమెరా గుంజుకొని కిడ్నాప్ చేసి తన గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి రెండు గంటలు చిత్రహింసలు పెట్టి అమ్మనా బూతులు తిడుతూ హింసించిన విధానాన్ని కాట కుమారస్వామి ముదిరాజ్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రెండు రోజులుగా వార్తలు వస్తున్న దానిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని, బహిరంగంగా ముదిరాజ్‌లకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కౌశిక్‌రెడ్డిపై న్యాయపరమైన విచారణ చేపట్టి తన ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, లేకుంటే ముదిరాజ్ ప్రభంజనం చూడాల్సి వస్తుందన్నారు. అలాగే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ యూత్ కన్వీనర్ కాట కుమారస్వామి, మండలాధ్యక్షుడు హంస భద్రయ్య, చెన్నారావుపేట మత్స పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు యాట సుధాకర్, సాధబోయిన రాజు, భువనగిరి స్వామి, ఎదురబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News