Tuesday, January 21, 2025

డ్రగ్స్ కేసులో కెటిఆర్‌ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర:పాడి కౌశిక్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ కేసులో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఇరికించేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నిజానికి ప్రభుత్వ టార్గెట్ రాజ్ పాకాల కాదని, కెటిఆర్ అని వెల్లడించారు. పార్టీ జరుగుతున్న ఫాంహౌస్‌కి కెటిఆర్ వస్తారని, అక్కడ ఆయనను డ్రగ్స్ కేసులో గాని, ఇంకేదైనా కేసులో గాని ఇరికిద్దామని చూశారని మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేతలు తనపై కూడా ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని, తనను ట్రాప్ చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని అన్నారు.

తాను ప్రైవేటు ఫంక్షన్‌కి వెళ్తే అక్కడికి డిఎస్‌పిలు, సిఐలు,కానిస్టేబుళ్లు వచ్చారని, అక్కడ డ్రగ్స్ పెట్టి కేసు నమోదు చేయాలని ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారు చెకింగ్ చేస్తామని అంటే చెక్ చేసుకోమని చెప్పారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి మందు తాగడం అనే విషయం వాళ్లకు తెలియదని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇరికించకుండా ఎందుకు వదిలేశారని సిఎం ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని తిట్టారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, తన ఇంటి చుట్టూ రోజు ఇంటిలిజెన్స్ వాళ్ళను పెడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి కుతంత్రాలు ఎన్ని చేసినా.. భయపడేది లేదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News