Wednesday, January 8, 2025

విద్యుత్ షాక్‌తో పాడిగెదె మృత్యువాత

- Advertisement -
- Advertisement -

లింగంపేట్ : మండలంలోని ఐలాపూర్ గ్రామంలో మంగళవారం బోరు మోటారు స్టాటర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి పాడి గేదె మృత్యువాత చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన పోకల పెద్దోళ్ల రాజుకు చెందిన పాడి గేదె రోజువారిగా మేత మేయడానికి వెళ్లి మేస్తున్న క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో బోరు మోటారు స్టాటర్ వద్ద కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడినట్లు తెలిపారు.

బాధితుడి సమాచారం మేరకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించి విద్యుత్ షాకుతో పాడిగేదె మృత్యువాత చెందినట్లు నిర్దారించారు. స్థానిక పశువైధ్యాధికారి రవి కుమార్ మృతి చెందిన గేదె పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన పాడిగేదె ఖరీదు రూ. 50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News