Monday, December 23, 2024

ఆజాద్‌కు పద్మ అవార్డు ప్రకటన ఫక్కా రాజకీయ నిర్ణయమే: వీరప్పమొయిలీ

- Advertisement -
- Advertisement -

Padma award for Azad a political decision Says Veerappa Moily

బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై కాంగ్రెస్‌లో వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు ప్రకటనకు ఒకరు అనుకూలంగా అభినందిస్తుంటే మరొకరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ కేవలం రాజకీయ కోణం లోనే కేంద్రం ఈ అవార్డు ప్రకటించిందే తప్ప ఎలాంటి పనితనాన్ని ప్రతిభను పరిగణన లోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ అవార్డును స్వీకరించే ముందు కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల నష్టమా కాదా అని ఆలోచించి ఉండాల్సిందని పేర్కొన్నారు. అవార్డు తీసుకోవాలా వద్దా అన్నది ఆజాద్ నిర్ణయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News