Monday, December 23, 2024

వికసించిన తెలుగు పద్మాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024 పద్మపురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందించిన వారికి గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో పద్మ పురస్కారాలను అందించడం ఆనవాయితి. తెలుగువారు వెంకయ్యనాయుడు, నటుడు చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్ ప్రకటించారు. ఈ ఏడాది మొత్త 132 మందికి పద్మపురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు ప్రకటించారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత్త్న్రను బీహార్ జననాయక్ మాజీ సిఎం కర్పూరి ఠాకూర్‌కు ప్రకటించారు.

పద్మవిభూషణ్ అందుకున్నది వీరే
ప్రజా సంబంధాల రంగంలో ఎం. వెంకయ్యనాయుడు (మాజీ ఉపరాష్ట్రపతి) , కళారంగంలో వై జయంతి మాల బాలి (తమిళనాడు) కొణిదెల చి రంజీవి , సామాజిక సేవారంగం నుంచి బిందేశ్వర్ పాఠక్ (బీహార్), కళారంగం నుంచే పద్మ సుబ్రమణ్యం (తమిళనాడు) ఈసారి పురస్కారాల్లో పద్మశ్రీలుగా ఎంపికైన వారిలో ముం దుగా అన్‌సంగ్ హీరోస్ కేటగిరిలో 34 మంది పే ర్లను ప్రకటించారు. కాగా తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీలు వచ్చాయి. తెలంగాణ నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. చిందు యక్షగాన కళాకారుడుగా

పేరొందిన జనగామకు చెందిన గడ్డం సమ్మయ్య ఈ కళలో ఐదు దశాబ్దాలుగా తమ ప్రతిభ చాటుకుంటూ వచ్చారు. తన ప్రదర్శనతో పలు సామాజిక అంశాలపై చైతన్యం కల్గిస్తూ, గ్రామీణ ప్రజలలో అక్షరాస్యత కోసం తన వంతు పాత్ర పోషించారు.చిందు యక్ష కళాకారుల సంఘం, తన పేరిట గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం వంటి సంస్థలు ఏర్పాటు చేసి యక్షకళలో వారికి ప్రోత్సాహం అందించారు. పూర్తిగా గ్రామీణ పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన రైతుకూలీగా కూడా పనిచేశారు. యక్షగాన కళను ఆయన తన పూర్వీకులు నుంచి నేర్చుకున్నారు.

బుర్రవీణా వాయిద్యకారుడు కొండప్ప
విశిష్టమైన బుర్రవీణా వాయిద్యకళను సజీవంగా ఉంచేందుకు నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరికొండప్ప విశిష్ట పాత్ర వహించారు. బుర్ర వీణ అరుదైన అంతరించిపోతున్న కళగా కొట్టుమిట్టాడుతోంది. దీనిని ఆయన తన తపనతో కళాతపస్విరీతిలో పోషిస్తూవచ్చారు. బుర్రవీణను అత్యంత ప్రత్యేకమైన వెదురుతో రూపొందిస్తారు. దీనితో వాయిద్యాల సృష్టికి ఆయన పాటుపడుతూ వచ్చారు. పద్మశ్రీతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇటువంటి పలువురు అజ్ఞాత కళాకారులు ఈసారి పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు.

దేశ తొట్టతొలి మహిళా మావటి పర్బతి బారువా (హస్తి కన్య), గిరిజన పర్యావరణవేత్త ఛామి ముర్మూ, సామాజిక కార్యకర్త సంఘటనికిమ, ప్లాస్టిక్ సర్జన్ ప్రేమా ధన్‌రాజ్ వంటి ఇంతకాలం ఎటువంటి గుర్తింపు లేని వారు ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు. సౌత్ అండమాన్‌కు చెందిన సేంద్రీయ రైతు కె చెల్లమ్మాళ్, ఇంటర్నేషనల్ మల్లకాంబ్ కోచ్ ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండే వంటివారికి పద్మశ్రీ వరించింది. కాసరగోడ్‌కు చెందిన వరి సాగు రైతు పురులియా దుఖ్ మాజీ పద్మశ్రీ అవార్డు దక్కించుకున్నారు. 650 వరి వంగడాలను పరిరక్షకులుగా నిలిచారు.

గడ్డం సమ్మయ్యకు ఎంఎల్‌ఎ పల్లా అభినందనలు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం పట్ల జనగామ ఎంఎల్‌ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. మొత్తం దేశ వ్యాప్తంగా 34 మంది పద్మ, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించిన వారిలో తెలంగాణ నుంచి నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన దాసరి కొండప్పకు, ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరికి ఉన్నారు. అంతరించిపోతున్న కళలను కాపాడటమే లక్ష్యంగా జీవిస్తున్న కళాకారులకు కేంద్రం పద్మశ్రీ ప్రకటించడం అందులో జనగామ ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్య ఉండటంపై ఎంఎల్‌ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి సమ్మయ్యకు ఎంఎల్‌ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాAరు. జనగామలోని సమ్మయ్య నివాసానికి శుక్రవారం పల్లా స్వయంగా వెళ్లి అభినందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News