ప్రముఖ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్ సినీనటుడు
బాలకృష్ణకు పద్మభూషణ్ మందకృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణిశర్మకు
పద్మశ్రీ కెఎల్ కృష్ణ, శ్రీ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలకూ
పద్మశ్రీ పురస్కారం మిరియాల అప్పారావుకు మరణాంతరం పద్మశ్రీ
ప్రకటన ఏడుగురు ప్రముఖులకు పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్,
113మందికి పద్మశ్రీలు 30 మంది అజ్ఞాత ప్రముఖులకు పద్మశ్రీ
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభు త్వం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మా అవార్డులతో సత్కరిస్తోంది. తెలంగాణకు చెందిన ప్రముఖ వై ద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్ లభించగా, సినీ నటుడు బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మ భూ షణ్ అవార్డు లభించింది. ఏడుగురు ప్రముఖులకు పద్మ వి భూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు పొందిన తె లుగు ప్రముఖులలో మంద కృష్ణ మాదిగ, మాడుగుల నా గఫణి శర్మ, సాహిత్యంలో కెఎల్ కృష్ణ, శ్రీ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖిలకు అవార్డులు లభించగా, మిరియాల అప్పారావుకు మరణానంతరం అవార్డు లభించిం ది. పద్మ విభూషణ్ పొందిన వారిలో జస్టిస్ జగదిశ్ ఖేహా ర్, గుజరాత్‌కు చెందిన కుముదినీ రజనీకాంత్ లాఖియా, కర్ణాటకకు చెందిన లక్ష్మీ
నారాయణ సుబ్రమణ్యం, జానపద గాయని శారదా సిన్హా, జపాన్ కు చెందిన సుజుకీ చీఫ్ ఒసామూ సుజికీకి, కేరళకు చెందిన ఎంటి వాసుదేవన్ కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డు లభించింది. 23 మంది మహిళలకు , పది మంది విదేశీయులకు ఎన్ ఆర్ ఐ లకు,పద్మా అవార్డులు లభించగా, 13 మందికి మరణానంతరం ఈ అవార్డులు లభించాయి. బీహార్ కు చెందిన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ మోడీ, ఆర్థికవేత్ బిబేక్ దేబ్రాయ్, గజల్ గాయకుడు
పంకజ్ ఉధాస్ లకు పద్మ భూషణ్ మరణానంతరం లభించింది. అలాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి,కి మరమానంతరం, పద్మభూషణ్ లభించింది. చిత్ర నిర్మాత, శేఖర్ కపూర్ ను పద్మ భూషణ్ తో సత్కరించనున్నారు. ఎస్ బీఐ మాజీ చైర్ పర్శన్ అరుంధతి భట్టాచార్య, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ హాకీ ఆటగాడు పిఆర్ శ్రీజేశ్ లకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
30 మంది అజ్ఞాత ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు
దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి పొందినా, గుర్తింపు పొందని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. పద్మశ్రీ అవార్డులు పొందిన వారిలో గోవాకు చెందిన 100 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధురాలు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఢాక్ క్రీడాకారిణి, భారతదేశపు మొదటి మహిళా తోలుబొమ్మలాట కళాకారిణి వంటివారు ఉన్నారు. ఆమెకు 96 ఏళ్ల వయస్సులో ఈ అవార్డు దక్కింది. పద్మశ్రీ అవార్డు పొందిన విభిన్న రంగాలకు చెందిన వారిలో 30 మంది అజ్ఞాత వీరులే. గోవా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన లిబియా లోబో సర్దేశాయ్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకోనున్నారు. ఆమె పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు 1955లో అటవీ ప్రాంతంలో అజ్ఞాతంగా వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే రేడియో స్టేషన్‌ను స్థాపించారు. అవార్డు గ్రహీతలలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 57 ఏళ్ల ఢాక్ కళాకారుడు గోకుల్ చంద్ర డే ఒకరు. పురుషుల ఆధిపత్యంగల రంగంలో 150 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రఖ్యాతి గడించారు.
డే మహిళలకోసం సంప్రదాయ వాయిద్యం కంటే 1.5 కిలోల తక్కువ బరువున్న ధక్ రకాన్ని సృష్టించాడు. వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ వంటి మాస్ట్రోలతో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. ఈ సారి చేనేతకు పద్మశ్రీ అవార్డు లభించింది. 82 ఏళ్ల సాలీ హోల్కర్ కనుమరుగవుతున్న మహేశ్వరి క్రాఫ్ట్ కు కొత్త ఊపిరి పోశారు. సాంప్రదాయ నేత పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో చేనేత పాఠశాలను స్థాపించారు. అమెరికాలో జన్మించినా, రాణి అహల్యాబాయి హోల్కర్ వారసత్వంతో స్ఫూర్తి పొంది, 300 ఏళ్ల నాటి నేత వారసత్వం పునరుజ్జీవింపజేయడానికి ఆమె అంకితం అయ్యారు. వన్యప్రాణి పరిశోధకుడు, మరాఠీ రచయిత మారుతీ భుజంగరావు చిటంపల్లి (92) జైపూర్‌కు చెందిన 68 ఏళ్ల భజన గాయని బటూల్ బేగం, తమిళనాడుకు చెందిన పెర్కషన్ వాద్యకారుడు వేలు ఆసన్ ఈ అవార్డు పొందిన వారిలో ఉన్నారు. అలాగే, తోలు బొమ్మల కళాకారిణి భీమవ్వ దొడ్డబాలప్ప కు అవార్డు లభించింది. 96 ఏళ్ల ’గొంబేయాట అమ్మమ్మ’ గా పేరుపొందిన భీమవ్వ 14 ఏళ్లకే ఈ కళలో ప్రావీణ్యం సంపాదించింది. 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.
తంగాలియా అనే చేనేత కళాకారుడు అవ్జీభాయ్ నాగ్జీభాయ్ , పేదలకు ఉచితంగా కేన్సర్ చికిత్సచేసిన విజయలక్ష్మి దేశమనే , మహారాష్ట్రకు చెందిన చైత్రం దేవ్ చంద్ పవార్ లకూ అవార్డు లభించింది. చైత్రం దేవ్ చంద్ పవార్ మహారాష్ట్రలో 400 హెక్టార్ల అటవీ సంపదను పరిరక్షించారు. సాంప్రదాయ గిరిజన సంగీత విద్వాంసుడు, ’సూలూరు’ లేదా ’బస్తర్ ఫ్లూట్’ సృష్టికర్త పాండి రామ్ మాండవి కూడా అవార్డు అందుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన 91 ఏళ్ల సామాజిక కార్యకర్త రాధా బహిన్ భట్, గుజరాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ సోనీలను అవార్డుతో సత్కరిస్తున్నారు. అస్సాంకు చెందిన గిరిజన సంగీత విద్వాంసుడు జోయనాచరణ్ బఠారి, దిమాసా జానపద సంగీతం ప్రచారం కోసం తన జీవితం అంకితం చేశారు, ఆయనకు,కువైట్ కు చెందిన యోగా అభ్యాసకుడు షేఖా ఎజే అల్ సబాహ్, నేపాలీ జానపద గాయకుడు గ్యాంగ్‌టాక్ నరేన్ గురుంగ్ పద్మశ్రీ అవార్డు పొందారు. ఎయిమ్స్ గైనికాలజీ శాఖ మాజీ హెడ్ నీర్జా భట్ల పద్మశ్రీకి ఎంపికయ్యారు.