సీడీఎస్ బీపిఎన్ రావత్‌కు పద్మవిభూషణ్, ఆజాద్‌కు పద్మభూషణ్
తెలుగువారు మొగిలయ్య , గరికిపాటి లకు పద్శశ్రీలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కనులపండుగగా జరిగింది. 2022 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఇద్దరికి పద్మవిభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. దివంగత సిడీఎస్ జనరల్ బిపిన్ రావత్ , గీతా ప్రెస్ మాజీ ఛైర్మన్ రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) లకు పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ కుమార్తెలు కృతిక , తారిణి, ఖేమ్కా తనయుడు రాష్ట్రపతి నుంచి అవార్డులను అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు. పారాలింపిక్ విజేత దేవేంద్ర ఝరియా (పద్మభూషణ్)స్వామి సచ్చిదానంద (పద్మభూషణ్), టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (పద్మభూషణ్) మాజీ కాగ్ రాజీవ్ మెహ్రిషి (పద్మభూషణ్), సీరం ఇనిసిట్యూట్ సంస్థాపకులు సైరస్ పూనావాలా ( పదభూషణ్ ) గుజరాత్‌కు చెందిన సచ్చిదానంద స్వామి (పద్మభూషణ్)హాకీ ప్లేయర్ వందనా కటారియా (పదశ్రీ), పారా షూటర్ అవనీ లేఖరా (పద్మశ్రీ), యోగారంగంలో విశేష కృషికి స్వామీ శివానంద (పద్మశ్రీ) మహాశాస్త్రావధాని గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ) , కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య (పద్మశ్రీ), అవార్డును అందుకున్నారు.
అరుదైన దృశ్యం
125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద అవార్డు తీసుకునే ముందు ప్రదాని నరేంద్రమోడీకి పాదాభివందనం చేశారు. దీంతో స్వామి శివానందకు ప్రధాని ప్రతినమస్కారం చేశారు. అవార్డు అందుకునే ముందు స్వామీ శివానంద సభకు, రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. అవార్డు బహూకరించేముందు రాష్ట్రపతి కోవింద్ ఆయనను ప్రేమతో పైకి లేపి వారించారు. మొత్తం 63 మందికి రాష్ట్రపతి కోవింద్ పద్మ అవార్డులు అందజేశారు. ఈ ంవత్సరం 128 అవార్డులు ప్రకటించగా, రెండు విడతల్లో అవార్డుల ప్రదాన కార్యక్రమం ఏర్పాటు అయింది నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మభూషన్, 107 పద్మశ్రీ అవార్డులను కేంద్రం వివిధ రంగాల్లో ప్రముఖులకు ప్రకటించింది. 34 మంది మహిళలు, మరణానంతరం 13 మందికి, పలువురు విదేశీలకు కూడా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.