Saturday, November 2, 2024

గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్.. కాంగ్రెస్‌లో విభిన్న స్పందనలు

- Advertisement -
- Advertisement -
Padma Bhushan for Ghulam Nabi Azad
కాంగ్రెస్‌కు ఇక ఆజాద్ సేవలు అక్కరలేదని వ్యంగ్య వ్యాఖ్య

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై కాంగ్రెస్‌లో విభిన్న స్పందనలు వచ్చాయి. దీనిపై జీ 23 సభ్యులు, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్న వారి మధ్య చీలిక వచ్చింది. జీ 23 సభ్యులైన కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌శర్మ , సీనియర్ నేతలు కపిల్ సిబాల్, శశిథరూర్ ఆజాద్‌కు పద్మభూషణ్ రావడాన్ని బహిరంగంగానే స్వాగతించారు. ప్రజాసేవలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి జీవితకాలం సేవ చేసిన ఆజాద్‌కు ధన్యవాదాలని ట్వీట్ చేశారు. ఆయన ప్రజాసేవను మొత్తం దేశమే గుర్తించినందున ఇక ఆయన సేవలు కాంగ్రెస్‌కు అవసరం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సిబాల్, ఆనంద్‌శర్మ, శశిథరూర్ వీరంతా జి23 సభ్యులు. కాంగ్రెస్ వ్యవస్థాపరంగా ప్రక్షాళన కావాలని కోరుతూ 2020 లో సోనియా గాంధీకి లేఖ రాసిన వారు. వీరిలో ఆజాద్ కూడా పాలుపంచుకున్నాడు. పద్మభూషణ్ దక్కడానికి ఆజాద్ పూర్తి అర్హులే అని సిబాల్ శుభాకాంక్షలు ట్వీట్ చేశారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరు పొందిన జి 23 సభ్యుడు జైరాం రమేశ్ మాత్రం పూర్తి భిన్నంగా స్పందించారు. పశ్చిమబెంగాల్ మాజీ సిఎం బుద్దదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించిన తరువాత జైరాం రమేశ్ తన ప్రకటనలో గులాం నబీ ఆజాద్‌కు పద్మభూషణ్ ప్రకటించడం సరైనదేనని, అయితే ఆయన గులాంలా కాకుండా ఆజాద్‌గా ఉండాలని కోరుకుటుంటన్నారని వ్యంగ్యంగా చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News