Sunday, December 22, 2024

తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి కుట్ర

- Advertisement -
- Advertisement -

padma devender reddy comments on BJP

 

మెదక్ : తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి కుట్ర చేస్తోందని మెదక్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ పార్టీ కుట్రకు నిరసనగా నేడు మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు, బీజేపీ మోడీ అమిత్ షా దిష్టి బొమ్మల దహనం చేశారు. నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ నియోజకవర్గ, జిల్లా ప్రజలకు పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెరాస పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు సంచులతో కొనుగోలు చేసే అప్రజాస్వామిక కుసంస్కృతికి తెరలేపిన బీజేపీ దుష్ట నీతికి నీచ సంస్కృతికి నిరసనగా నేడు ఢిల్లీ పీఠం దద్దరిల్లే విధంగా నిరసనలు, బీజేపీ మోడీ షాల దిష్టిబొమ్మ లను దగ్ధం చేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బు సంచులతో కొనుగోలు చేసే అప్రజాస్వామిక సంస్కృతికి తెరలేపిన బీజేపీ, మోడీ అమిత్ షా ల దుష్ట నీతిని సంస్కృతిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఆస్థిర పరిచె కుట్రకు పాల్పడుతున్న బిజెపికి తగిన గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలన్నారు.

మోడీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి తెలంగాణపై విషం కక్కుతూ, అన్ని అభివృద్ధి సంబంధిత అంశాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతుల్లో కూల్చాలని ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఈ చర్యలకు నిదర్శనమే నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దుష్ట ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బిజెపి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ మెదక్ జిల్లా మరియు మెదక్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని పట్టణ,మండల కేంద్రాల్లో నిరసన తెలుపడంతో పాటు బిజెపి, మోడీ,అమిత్ షా ల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చే కుట్రలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరూ కలసి రావాలని నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News