అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా చేయూత అందిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 89 మంది లబ్దిదారులకు రూ. 29,43000 చెక్కులను అందజేశారు. పాపన్నపేట మండలం సంబందించిన 7 కళ్యాణలక్ష్మి చెక్కులను రూ. 7,00,812లు అందజేశారు. 3 సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌ఓసీలు రూ. 6,50,000 నిమ్స్ ఆస్పత్రికి మంజూరు చేయించారు.
పేదలు అనారోగ్యాల బారిన పడి ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సరైన దృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. వేలాదిమందికి కోట్లాది రూపాయల చెక్కులను అందజేశామన్నారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్, పాపన్నపేట, మెదక్ మండల రైతుబందు అద్యక్షులు శ్రీనివాస్, కిష్టయ్య, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, శంకరంపేట మండల పార్టీ అద్యక్షులు పట్లోరి రాజు, నాయకులు రాగి అశోక్, సంజీవరెడ్డి, యాదగిరి, సాంబశివరావు, సర్పంచ్‌లు జగన్, గురుమూర్తిగౌడ్, బద్రి మల్లేశం, ప్రభాకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.