Monday, December 23, 2024

ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి పథకం వరం

- Advertisement -
- Advertisement -

చిన్నశంకరంపేటః ఆడపిల్లల తల్లితండ్రులకు కళ్యాణలక్ష్మి పథకం ఓ వరం లాంఇదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని గజగట్లపల్లి, మడూర్ గ్రామాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గజగట్లపల్లి గ్రామానికి చెందిన బర్మాల యాదగిరి ఇటీవల మృతిచెందిగా టీఆర్‌ఎస్ పార్టీభీమా చెక్కునుభార్య అనసూయకు అందజేశారు. ఇంటింటికి వెళ్లి సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గజగట్లపల్లి గ్రామానికి చెందిన ముత్తగారి రవి పెంటయ్యలు రోడ్డు ప్రమాదానికి గురి కాగా బాదితులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిలకు కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష116రూపాయలు అందించి మేనమామగా నిలుస్తున్నారని తెలిపారు. ఆసరా పథకం ద్వారా వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు 2016, వికలాంగులకు 3016 రూపాయల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్లూరి మాధవి, మండలరైతుబంధు అద్యక్షుడు లకా్ష్మరెడ్డి, బీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు, మండల సర్పంచ్‌ల ఫోరం అద్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచ్‌లు మీనా, నర్సమ్మ, లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్, సుధాకర్, బాగారెడ్డి, సత్యనారాయణ, నాగభూషణం, యాదగిరి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News