- Advertisement -
హైదరాబాద్: మెదక్ ఎంఎల్ఎ పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణ పర్యటన ముగించుకొని రామయంపేటలో వివాహానికి వెళ్తుండగా అక్కన్న పేట రైల్వే గేట్ వద్ద వెనక వస్తున్న వాహనం వేగంగా ఢీకొట్టడంతో భారీ శబ్దంతో ఎంఎల్ఎ కారు ఎగిరిపడింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలోనే పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. వాహనం వెనక నుండి ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది.
- Advertisement -