Monday, December 23, 2024

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

మెదక్ పట్టణంలో అయ్యప్ప ఆలయంలో టీఆర్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్, న్యాయవాది జీవన్‌రావు స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పడిపూజ గురుస్వామి టిపి హరిదాస్, ఆలయ ప్రదాన అర్చకులు వైద్యరాజు పంతులు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వామివారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లిఖార్జున్‌గౌడ్, పట్టణ పార్టీ అద్యక్ష కార్యదర్శులు ఎం. గంగాధర్, గడ్డమీది కృష్ణగౌడ్, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News