Sunday, January 19, 2025

కొత్త ప్రభాకర్ రెడ్డి కోలుకోవాలని మెదక్ చర్చిలో పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు..

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రపంచ ప్రసిద్ది గాంచిన మెదక్ సియస్ఐ చర్చిలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకొని ఆరోగ్యంతో తిరిగి రావాలని మంగళవారం మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో ఎప్పుడు కలిసి మెలిసి ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్నప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంతో తిరిగి వచ్చి ప్రజల్లోకి వెళ్లానని భగవంతున్ని కోరుకున్నట్లు చెప్పారు. భౌతిక దాడులను ప్రజలందరూ ఖండించాలని అన్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్ఎస్ గెలిచి.. కేసీఆర్ మూడోసారి సిఎం అవుతారని ఆమె జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News